బండ్ల అమ్మకాలు పెరిగినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బండ్ల అమ్మకాలు పెరిగినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

క్యూ1లో 3,180,039 యూనిట్ల సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
న్యూఢిల్లీ: కరోనా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఆటోమొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీ మెల్లమెల్లగా బయటపడుతోంది. లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిస్ట్రిక్షన్లను ఎత్తివేస్తుండటంతో బండ్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. తాజాగా సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల (సియామ్)  విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య అమ్మకాలు 113 శాతం పెరిగి 31,80,039 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో క్యూ1లో అమ్మకాలు  14,92,612 యూనిట్లుగా రికార్డయ్యాయి. అయితే, 2019–-2020 ఇదే క్వార్టర్లో  ఆటో ఇండస్ట్రీ 60,84,478 యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 48 శాతం ఎక్కువ. 2020–21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మకాలు సున్నాగా రికార్డయ్యాయి. ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు విపరీతంగా ఉండటం, లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధించడమే ఇందుకు కారణం. ఈ సందర్భంగా సియామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకరు మాట్లాడుతూ ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొరతను తీర్చడానికి తమ ఇండస్ట్రీ ప్రభుత్వానికి ఎంతో సాయపడిందని  చెప్పారు. ఆక్సిజన్​ తయారీ కోసం చాలా ఆటోమొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు తమ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆపేశాయని చెప్పారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి వీలైనంత సహకరించామని అన్నారు.