వన మహోత్సవంలో పాల్గొన్న వేముల ప్రశాంత్ రెడ్డి

వన మహోత్సవంలో పాల్గొన్న వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు: రాష్ట్రంలో కోటి 20 లక్షల ఇండ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుని భారత కీర్తిని ప్రపంచానికి చాటాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన వన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేల్పూర్ మండలం పడగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఫ్రీడమ్ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 750 మొక్కలు నాటారు. జాతీయ జెండాలను చేతబట్టుకుని, దేశభక్తి నినాదాలు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఎడపల్లి మండలం జానకంపేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పోలీస్ శిక్షణ  కేంద్రంలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జడ్జి కె.సునీత, కలెక్టర్ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకాగా సీపీ నాగరాజు, ఇతర అధికారులు, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీ కేడెట్లు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు.  

నిజాంసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘మన కోసం మనం’ సంస్థ ఆధ్వర్యంలో 1000 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే హన్మంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిండే,  సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిశోర్ పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 15వ వార్డులో ఫ్రీడమ్ ఫార్కు ప్రారంభించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్​దొత్రే, డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో నిఖిత, కౌన్సిలర్​వనిత, కమిషనర్​ దేవేందర్ పాల్గొన్నారు. ఎస్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే జూనియర్​కాలేజీ ఆధ్వర్యంలో టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తిరంగ ర్యాలీ నిర్వహించారు. లింగంపేటలో జరిగిన వమహోత్సవంలో  ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు. బోధన్​ మండలంలోని పెంటకుర్దులో జరిగిన ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్డీవో రాజేశ్వర్, ఎంపీపీ సావిత్రి, జడ్పిటీసీ గిర్దవార్ లక్ష్మి, ఎంపీడీవో మధుకర్, బోధన్​టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్​చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్ పద్మావతి,  కమిషనర్​రామలింగం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.