Gruhalakshim: పాత ఇల్లు ఉన్నా..స్థలం ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు: వేముల

Gruhalakshim: పాత ఇల్లు ఉన్నా..స్థలం ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు: వేముల

హైదరాబాద్, వెలుగు: గృహలక్ష్మి స్కీమ్ అప్లికేషన్ల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గ్రామ పరిధిలో పాత ఇల్లు ఉన్నా, స్థలం ఉన్నా  దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ప్రజలు తమ అప్లికేషన్లను ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు ఇవ్వొచ్చని మంత్రి సూచించారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు ఇస్తున్నామని, అవి పూర్తయిన వెంటనే రెండో దశ గృహలక్ష్మి స్కీమ్​ కోసం దరఖాస్తులు తీసుకుంటారన్నారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా గృహలక్ష్మి స్కీమ్ అందుతుందని స్పష్టం చేశారు. ఈ పథకం అప్లికేషన్ల గడువు ముగుస్తుందంటూ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని సూచించారు.