Autorickshaw Race : ఆటో రిక్షా రేస్.. ఫార్ములా1 కంటే బాగుంది

 Autorickshaw Race : ఆటో రిక్షా రేస్.. ఫార్ములా1 కంటే బాగుంది

బైక్ రేసింగ్ చూశాం.. కారు రేసింగ్ చూశాం.. గుర్రం రేసింగ్ కూడా చూశాం.. మరీ ఎప్పుడైన ఆటోల రేసింగ్ చూశారా.. ఈ వీడియోలో చూడొచ్చు. ఢిల్లీలో జరిగిన ఈ రేసులో ఎవరు గెలిచారనేది పక్కన పెడితే.. ఆటోల రేసింగ్ రేసింగ్ అందరిని ఆకట్టుకుంటోంది. రేసింగ్ క్రీడ అంటే ఉత్కంఠ భరితమైన క్రీడ. ఈ క్రీడల్లో పాల్గొనే వారికి మంచి పేరు, డబ్బులు సంపాదిస్తారు. నమ్మశక్యం కాని వేగంతో సాగే బైక్, కారు రేసింగ్ లను చూసేందుకు ఫ్యాన్స్ ఇష్టపడుతుంటారు.. కానీ ఇటీవల ఢిల్లీలో మూడు ఆటోలతో రేసింగ్ నిర్వహించారు కొందరు.. ప్రొఫేషనల్ రేసింగ్ మనకు గుర్తుకు వచ్చేది ఫార్ములా 1 రేసింగ్.. ఫ్రొఫెషనల్ కాకపోయినప్పటికీ ఈ ఆటో రేసింగ్ పోటీ కూడా తక్కువేం కాదన్నట్లు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

తక్కువ బరువున్న మూడు చక్రల బండి ఆటోరిక్షా.. భారత దేశంలో దిగువ, మధ్య తరగతి ప్రజలను తక్కువ ఖర్చుతో గమ్యానికి చేరుస్తున్న వాహనం. ప్రజల రోజువారీ ప్రయాణానికి ఉపయోగపడే ఈ వాహనం.. ఇప్పుడు రేసులో కూడా పడుతూ సోషల్ మీడియాను ఆకట్టుకుంటోంది. ప్రాంతం పేరు తెలియదు గానీ ఢిల్లీలో జరిగిన ఆటో రిక్షా రేసింగ్ సంబంధించిన వీడియోను రెడ్డిట్ లో పోస్ట్ చేశారు. ఇది నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. ఫార్ములా రేసింగ్ మాదిరిగా నే ఆటో రేసింగ్ కూడా నిర్వహించాలని కొందరు నెటిజన్లు సరదాగా  కామెంట్ చేశారు. ఇంకొందరైతే  ఆటో రేస్ లో పాల్గొన్న డ్రైవర్లను ప్రొ డ్రైవర్లు ప్రశంసించారు. ఇది 2023 ఫార్ములా 1 రేసింగ్ కంటే ఆసక్తికరంగా ఉందని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.