6వేల చీర 300కే.. నకిలీ ఇక్కత్ దందాపై రెయిడ్స్

6వేల చీర 300కే.. నకిలీ ఇక్కత్ దందాపై రెయిడ్స్

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో చేనేత వస్త్రాల షో రూమ్ లపై తనిఖీలు నిర్వహించారు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను మరమగ్గాలపై డూప్లికేట్ గా తయారు చేసి అమ్ముతున్న 12 షాపుల్లో తనిఖీలు చేశారు. పలు షాపుల్లో డూప్లికేట్ చీరలను గుర్తించి షాపులకు నోటీసులు జారీచేశారు. నకిలీ చీరలు తయారు చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు అధికారులు.  

పోచంపల్లి పట్టు చీరలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది.రపంచంలో మొట్టమొదటి సారి పోచంపల్లి చీరలకు ప్రత్యేక భౌగోళిక  గుర్తింపు( GI )ని ఇచ్చారు. ఇదే అదునుగా తీసుకున్న వ్యాపారులు హ్యాండ్లూమ్ డిజైన్ లను పవర్లూమ్ వాళ్ళు కాఫీ చేస్తూ కనీసం రూ.6 వేలు ఉండాల్సిన చీరలను 300 వందలకు అమ్ముతున్నట్లు తనిఖీల్లో  గుర్తించారు. 

1985 చేనేత పరిరక్షణ చట్టం కింద 11 ఐటమ్స్ ను చేనేతకి రిజర్వ్ చేశారు. పోచంపల్లి ఇక్కత్ చీరలను  చేతులతో చేయాలి..  కానీ పవర్లూమ్ మిషన్స్ తో చేసి అమ్ముతున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల సమయంలో వ్యాపారులు  దొంగ చాటుగా  స్టాక్ బ్యాగ్ లు తరలించే ప్రయత్నం చేశారు.  ప్రత్యేక గుర్తింపు ఉన్న పోచంపల్లి చీరల ప్లేసులో ఇలా ప్రింటెడ్ చీరలను అమ్మడాన్ని  అధికారులు సీరియస్ గా తీసుకున్నారు.