రొటీన్ కథ ... ఆకట్టుకోలేకపోయిన బిచ్చగాడు 2

రొటీన్ కథ ...  ఆకట్టుకోలేకపోయిన బిచ్చగాడు 2

విజయ్ ఆంటోని. ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది మల్టీ టాలెంటెడ్ యాక్టర్ లలో ఇతను ఒకడు. ఫస్ట్ మూవీ నుంచి ఢిఫరెంట్ స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుంటూ... ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక లేటెస్ట్ గా తానే మూవీని డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించిన మూవీ బిచ్చగాడు 2. హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ పై వచ్చిన ఈ మూవీ ఈ రోజు రిలీజైంది. మరీ ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగల్గిందా లేదా చూద్దాం.

ఏడేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు మూవీ బాక్సాఫిస్ వద్దా ఎంతపెద్ద హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఇందులో అమ్మ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్... బిచ్చగాడు2 లో సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చాడు. ఈ కాన్సెప్ట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా... రిలీజ్ కి ముందే టీజర్, ట్రైలర్ తో అభిమానుల్లో మాంచి బజ్ ని క్రియేట్ చేశాడు విజయ్ ఆంటోనీ.

మన దేశంలో వన్ ఆఫ్ టాప్ బిజినెస్ మ్యాన్ ఆస్తులపై... ఆయన నమ్మినవాళ్లే కన్నెస్తే ఎలా ఉంటంది. ఆ ఆస్తికోసం వాళ్లు ఎంతకు తెగించారు. అస్సలు బిజినెస్ మ్యాన్ కి బిచ్చగాడికి సంబంధం ఏంటి.? పేదరికంతో తినడానికి తిండికూడాలేని ఎంతో మందికి... ఒక బిజినెస్ మ్యాన్ తలుచుకుంటే ఏమి చేయగలడు అన్నదే ఈ సినిమా. ఇందులో సిస్టర్ సెంటిమెంట్ ని పెట్టీ... ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు విజయ్ ఆంటోనీ.

సిస్టర్ సెంటిమెంట్ తో యాక్షన్ అండ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాని విజయ్ ఆంటోనీ ఒంటి చేత్తో మోశాడు. అయితే నటుడిగా 100శాతం నిరూపించుకున్నా... డైరెక్టర్ గా అక్కడక్కడ కొన్ని పొరపాట్లు చేశాడు. థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులకు ఓవర్ సెంటిమెంట్ తో ఇబ్బంది పెట్టడంతో పాటు... సెకండాఫ్ మరీ డైలి సీరియల్ గా తీశాడు. ఫస్టాఫ్ ఎంగేజింగ్ చేసినంతగా... సెకండాఫ్ ని చేయలేకపోవడం మరో మైనస్. 

ఇక హీరోయిన్ కావ్యా థాపర్ కేవలం కొన్ని సీన్ లకే పరిమితం అయింది. తన యాక్టింగ్ కి ఈ మూవీలో పెద్దగా స్కోప్ లేదు. సినిమా భారాన్ని అంతా తనమీదే వేసుకున్న విజయ్... యాక్టింగ్ తో పాటు మ్యూజిక్ అందించాడు. ఎడిటింగ్ భాద్యతల్ని చేపట్టాడు. ఈ సినిమాలో విజయ్ యాక్టింగ్ తో పాటు తాను అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. హోమ్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించడంతో... మూవీ మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమా చూస్తున్నంతసేపు బిచ్చగాడులా కాకుండా... రిచ్ గాడులా అనిపిస్తుంటది.