Vijay-Mrunal Thakur: ఫ్యాన్స్తో హోళీ సంబరాలు..డ్యాన్స్ చేస్తూ అలరించిన విజయ్,మృణాల్

Vijay-Mrunal Thakur: ఫ్యాన్స్తో హోళీ సంబరాలు..డ్యాన్స్ చేస్తూ అలరించిన విజయ్,మృణాల్

స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సీతారామం(Sitaramam) ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్లో వేగం పెంచేశారు. 

ఈ మేరకు విజయ్ మృణాల్ ఇవాళ హోళీ (మార్చి 25) సంబరాలు ఫ్యాన్స్తో జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ..కల్యాణి వచ్చా వచ్చా పంచ కల్యాణి తెచ్చా తెచ్చా..సింగారీ చెయ్యందించా, ఏనుగంబారీ సిద్ధంగుంచా..అంటూ తాజా మూవీ ఫ్యామిలీ స్టార్ లోని సాంగ్ కు డ్యాన్స్ చేసి అలరించారు. ఈ సంబురాల్లో విజయ్, మృణాల్, ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

రీసెంట్గా రిలీజైన కళ్యాణి వచ్చా సాంగ్ లోని..ధమకు ధమా ధమారి, ఛమకు ఛమా ఛమారి, సయ్యారి సరాసరి మొదలుపెట్టే సవారి, డుమకు డుమా డుమారి, జమకు జమా జమారి, ముస్తాభై ఉన్నామని అదరగొట్టేయ్ కచేరి.. అంటూ ఉన్న లిరిక్స్ బాగున్నాయి.

ALSO READ :- బీజేపీలో చేరిన గాలి జనార్ధన్ రెడ్డి..

గోపీ సుందర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా..మంగ్లి, కార్తీక్ ఆలపించారు. విజయ్, మృణాల్ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. హుషారుగా ఉన్న ఈ మ్యారేజ్ సాంగ్‍ ప్రస్తుతం బాగా పాపులర్ అయింది.