అర్హులకు కేంద్ర పథకాలు చేరేందుకు కృషి

అర్హులకు కేంద్ర పథకాలు చేరేందుకు కృషి

బోయినిపల్లి, వెలుగు: ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరేందుకు కృషి చేయడమే వికసిత భారత్ సంకల్ప్ యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని కేంద్ర టెక్స్​టైల్​ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, వికసిత్ సంకల్ప యాత్ర జిల్లా నోడల్ అధికారి అజయ్ గుప్తా అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం అనంతపల్లి లో ఆయన భారత్​ సంకల్ప్ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

గ్రామంలో ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ స్కీమ్ లో లబ్ధిదారురాలు జంగ లహరి ఏర్పాటు చేసుకున్న ఆర్ఎస్ ఫ్లోర్ మిల్ యూనిట్ ను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్ గౌతమి, సర్పంచ్ సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ కంకణాల వనజ, జడ్పీ సీఈఓ గౌతంరెడ్డి, ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. 

కోనరావుపేట: కోనారావు పేట మండలం మల్కపేట గ్రామంలోని పాఠశాలలో నిర్వహించిన వికసిత్‌‌‌‌‌‌‌‌భారత్‌‌‌‌‌‌‌‌సంకల్ప యాత్రలో కలెక్టర్ అనురాగ్ జయంతి, సంకల్ప యాత్ర జిల్లా నోడల్ అధికారి అజయ్ గుప్తా పాల్గొన్ఆనరు. జిల్లాలోని అర్హులందరూ ప్రభుత్వ పథకాల ఫలాలను పొందాలన్నారు.