
1. బాల గణపతి, 2. తరుణ గణపతి, 3. భక్తి గణపతి, 4. వీర గణపతి, 5. శక్తి గణపతి, 6. ద్విజ గణపతి, 7. సిద్ధి గణపతి, 8. ఉచ్చిష్ట గణపతి, 9. విఘ్న గణపతి, 10. క్షిప్ర గణపతి, 11. హేరంబ గణపతి, 12. లక్ష్మీగణపతి, 13. మహా గణపతి, 14. విజయ గణపతి, 15. నృత్య గణపతి, 16. ఊర్ధ్వ గణపతి, 17. ఏకాక్షర గణపతి, 18. వరద గణపతి, 19. త్రయక్షర గణపతి, 20. క్షిప్ర ప్రసాద గణపతి, 21. హరిద్ర గణపతి, 22. ఏకదంత గణపతి, 23. శ్రిష్టి గణపతి, 24. ఉద్దండ గణపతి, 25. ఋణవిమొచన గణపతి,
26. దుండి గణపతి, 27. ద్విముఖ గణపతి, 28. త్రిముఖ గణపతి, 29. సింహ గణపతి, 30. యోగ గణపతి, 31. దుర్గ గణపతి, 32. సంకటహర గణపతి
గణేశుడి దండకము...
శ్రీ పార్వతీపుత్ర లోకత్రయస్తోత్ర సత్పుణ్యచారిత్ర భద్రేభవక్త మహాకాయ కాత్యాయనీనాధ సంజాత స్వామీ శివా సిద్ది విఘ్నేశ నీ పాద పద్మంబులన్, నీ కంఠంబు, నీ బొజ్జ, నీ మోము, నీ మౌళి బాలేందు ఖండంబులు నాలుహస్తంబులున్నీ కరాళంబు, నీ పెద్ద వక్రంబు దంతంబు, నీ పాద హస్తంబు లంబోదరంబున్, సదా మూషికాశ్వంబు, నీ మందహాసంబు, నీ చిన్ని తొండంబు, నీ గుజ్జు రూపంబు, నీ శూర్పకర్ణంబు, నీ నాగయజ్ఞోపవీతంబు, నీ దివ్యరూపంబు దర్శించి, హర్షించ సంప్రీతి మొక్కంగ, శ్రీ గంధమున్ కుంకుమాక్షతలాజుల్, పంకజంబుల్ తగన్ మల్లులునొల్లలున్మంచి చేమంతులున్, దెల్లగన్నేరులున్, మంకెనల్, పొన్నలున్, పువ్వులున్మంచి దూర్వంబులు నెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి, సాష్టాంగముంజేసి, విఘ్నేశ్వరా నీకు టెంకాయ, పొన్నంటి పండ్లున్ మరిన్మంచివో నిక్షుఖండంబులు, శ్రేగుబండ్లప్పడంబుల్, వడల్, నేతిబూరెల్ మదిన్ గోధుమప్పంబులున్, పునుగులున్, బూరెలున్, గారెలున్, చొక్కమౌ చల్మిడిన్, బెల్లమున్, తేనెయుంజున్ను, బాలాజ్యమున్నాను బియ్యంబు, నామంబు బిల్వంబు మేల్ బంగారు బళ్ళెమందుంచి, నైవేద్యముంబంచ నీరాజనంబున్, నమస్కారము జేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకేయన్య దైవంబులన్ బ్రార్ధనల్ సేయుటల్ కాంచనం బొల్లకే ఇన్ముదాగోరు చందంబంగాదే, మహాదేవ యోభక్తమందార, యో సుందరాకార, యో భాగ్య గంభీర, యో దేవచూడామణీ, లోకరక్షామణీ, బంధుచింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీ దాస దాసాను దాసుండ, శ్రీ దాంతజాన్వరాయుండ, రామాభిదాసుండ నన్నెప్పుడు చేబట్టి, సుశ్రేయునింజేసి, శ్రీమంతునిగా చూచి హృత్పద్మ సింబెలిసనారూఢతన్నిల్చి కాపాడుటేకాదు, నిన్గాల్చి ప్రార్థించు భక్తాళికిన్, కొంగుబంగారమై, కంటికిన్ తెప్పవై, బుద్దియు న్విద్యయు నాడియున్, పంటయున్, పుత్రపౌత్రాభి వృద్దిన్ దగన్కల్గగాజేసి, పోషింపుమంటిన్, గృపన్గావుమంటిన్, మహాత్మాయివే వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే నమస్తే నమస్తే నమః
ఇంతవరకూ జపించాక కింద ఇచ్చిన మంత్రాన్ని చదివి, పువ్వులతో కొన్ని నీళ్లు రెండు సార్లు చల్లాలి. ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః హస్తౌప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, పునః శుద్దాచమనీయం సమర్పయామి.