viral video: బర్త్ డే కేక్‌ను తుపాకీతో కట్ చేసిన యంగ్ లేడీ

viral video: బర్త్ డే కేక్‌ను తుపాకీతో కట్ చేసిన యంగ్ లేడీ

సంవత్సరానికి ఒక్కరోజు వచ్చే బర్త్ డే ఎవరికైనా చాలా స్పెషల్. ఆరోజు మొత్తం ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటాం.. ఖర్చుకు కూడా ఏం వెనుకాడం.. చుట్టూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో మంచి ఉషారులో ఉంటాయి.  పుట్టిన రోజు వేడుకలు ఎంత గ్రౌండ్‌గా, వెరైటీగా చేసుకుంటే అన్ని ఎక్కువ రోజులు ఆ మెమోరీస్ గుర్తుంటాయి. ఈ మధ్యకాలంలో తల్వార్‌లతో కేక్ కట్ చేయడం ట్రెండ్ అయింది. గజమాల, కూల్ క్రాకర్స్, శాలువాలో సన్మానం స్నేహితులు ఏర్పాటు చేస్తుంటారు. అయితే పంజాబ్‌లో యువతి క్లబ్‌లో తుపాకీతో  బర్త్ డే కేక్ కట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి పోలీసుల కంట పడింది. వెంటనే పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.

పంజాబ్ లోని బాగ్ రోడ్‌లో ఒక క్లబ్‌లో నిర్వహించిన బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ వేడుకల్లో గన్‌తో కేక్ కట్ చేసింది. ఆ సీన్ అంతా ఫ్రెండ్స్ వీడియో తీయగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు దీనిపైన విచారణ చేపట్టారు. క్లబ్ ఓనర్ ను పిలిపించి ప్రశ్నించారు. అది బొమ్మ తుపాకీ అని, బర్త్ డే వేడుకలు చేసుకునే వారు కొవ్వత్తులను వెలిగించడానికి ఇస్తామని క్లబ్ నిర్వాహకుడు చెప్పాడు. పోలీసులు మాత్రం అది రియల్ గన్ హ, లేక బొమ్మ తుపాకీనా అని నిర్థారించాలేదు. స్టేషన్ కు తుపాకీ తీసుకురావాలని ఓనర్ ను పోలీసులు ఆదేశించారు.

ALSO READ :- మెదక్ గెలిచి సీఎం రేవంత్కు గిప్ట్ గా ఇస్తాం : కొండా సురేఖ