ఆగస్టు నెల కన్యారాశి జ్యోతిష్యం: గ్రహాల సంచారం అనుకూలం..వీరికి గోల్డెన్ డేస్ వచ్చినట్టే..!

ఆగస్టు నెల కన్యారాశి జ్యోతిష్యం:  గ్రహాల సంచారం అనుకూలం..వీరికి గోల్డెన్ డేస్ వచ్చినట్టే..!

పరాభవనామ సంవత్సరం ( 2026) ఆగస్టు నెలలో గురుడు కన్యారాశిలో 9 వ ఇంటిలో.. లాభ స్థానంలో కీలక గ్రహాలు సంచారం చేయనున్నాయి.  బుధుడి నక్షత్ర పరివర్తనం ఈ రాశి వారికి కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. ఆదాయం అంచెలంచెలుగా పెరుగుతుంది.  ఈ నెలలోఈ  రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో సవివరంగా తెలుసుకుందాం. . .! 

కన్యా రాశివారికి ఆగష్టు నెలలో గ్రహ స్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆస్తి దక్కుతుంది. అప్పులు తీరుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. వాహన యోగం ఉంది. ఏళ్ల తరబడి రాకుండా నిలిచిపోయిన మొండి బాకీలు సులభంగా చేతికి అందుతాయి. కొత్త ప్రాజెక్టులు దక్కడంతో పాటు చేసే పనికి తగిన ప్రశంసలు, గుర్తింపు లభిస్తాయి.

 వృత్తిపరమైన పురోగతికి అవకాశాలు లభిస్తాయి. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే, ఆగస్టు మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మీకు ఊహించని పురోగతి లభిస్తుంది. ఖర్చులు తగ్గి, పొదుపు పెరుగుతుంది. లో కుటుంబం, స్నేహితుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు ఇది చాలా అద్భుతమైన కాలం. ఏదైనా ప్రత్యేక రంగంలో చదువుకోవాలనుకునే వారికి అవకాశాలు లభించవచ్చు.

 బుధుడు..గురుడు, శుక్రుడు.. అనుకూలత పెరగడం వల్ల  వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశముంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిదని పండితులు చెబుతున్నారు.

ALSO READ : ఆగస్టు నెల జ్యోతిష్యం : సింహరాశి వాళ్లు ఆవేశం తగ్గించుకోవాలి.. తొందరపాటు ఉంటే నష్టమే..

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తలపెట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.  అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వినడం జరుగుతుంది.

పరిహారం : సోమవారం పరమేశ్వరుని ఆలయాలను దర్శించడం.. గురువారం అన్నదానం చేయాలి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.