Gaami Trailer: విశ్వక్ అఘోరా మాత్రమే కాదు..ముట్టుకుంటే చచ్చిపోవడమే

Gaami Trailer: విశ్వక్ అఘోరా మాత్రమే కాదు..ముట్టుకుంటే చచ్చిపోవడమే

మాస్ క దాస్ విశ్వక్ సేన్‌ (Vishwak Sen) ప్రధాన పాత్రలో దర్శకుడు విద్యాధర్‌ (Vidyadhar) కాగిత తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami). వి సెల్యులాయిడ్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఘోరా గ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు విశ్వక్ సేన్‌. ఇటీవల విడుదలైన గామి టీజర్తో అంచనాలు రెట్టింపు అవ్వగా..లేటెస్ట్గా ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

నేను ఎవరో..ఎక్కడి నుంచి వచ్చానో..నాకీ సమస్య ఎప్పటినుంచో ఉందో..ఎంత ప్రయత్నించినా గుర్తురావడం లేదు” అంటున్న హీరో విశ్వక్ వాయిస్ తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. అఘోరా లుక్ లో విశ్వక్ సరికొత్తగా కనిపిస్తున్నారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చూడని సరికొత్త కథతో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

గామి స్టోరీ విషయానికి వస్తే..

ఈ సినిమాలో విశ్వక్ కు ఒక సమస్య ఉంటుందని తెలుస్తోంది. వేరే ఏ మనిషి అతడిని పట్టుకున్నా..కనీసం ముట్టుకోవాలని దగ్గరకు వచ్చినా అతనికి శరీరం పగిలిపోతూ ఉంటుంది. అంటే మానవ స్పర్శ అనేది అతడికి ఏ మాత్రం తగలకూడదు. అయితే, మొన్న టీజర్ రిలీజ్ వరకు గామి కథ ఇదే ఉంటుందని అనుకున్నారు. కానీ, ట్రైలర్ లో మాత్రం అంతకు మించిన స్టోరీని చూపించారు మేకర్స్. 

అఘోర అయిన శంకర్ తనకున్న సమస్యను పోగొట్టుకోవాలంటే..హిమాలయాల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే పుష్పాన్ని తాకాలని తెలియడంతో అక్కడికి చేసే ప్రయాణమే గామి. అలాగే, ట్రైలర్ లో మరో రెండు సమస్యలను చూపిస్తూ..దేవదాసి నుంచి ఒక మహిళను సాదారణ గృహిణిగా మార్చడం..ఆమె ఊరి నుంచి పారిపోవడం..ఆమెను తీసుకురాకపోతే గ్రామంకు అనర్థమని చెప్పడం..మరోపక్క ఎవరు లేని ఒక ప్రదేశంలో కొంతమందిని ఖైదీలుగా ఉండటం చూపించారు. అసలు ఈ రెండు ఘటనలకు..శంకర్ కు ఎలాంటి సంబంధం ఉంది..? అసలు శంకర్ కు ఉన్న సమస్య ఎలా వచ్చింది..? అనేది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

మార్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కేవలం క్రౌడ్ ఫండింగ్తో తెరకెక్కుతోంది. విశ్వక్ కూడా ఈ సినిమా చాలా కాలంగా కష్టపడుతున్నారు. కేవలం సినిమాలోని కంటెంట్ ఉన్న నమ్మకమే దానికి కారణం.మరి సరికొత్త కథా, కథనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.