రాష్ట్రపతి నిలయంలో విజిటర్స్ ఫెసిలిటీ సెంటర్

రాష్ట్రపతి నిలయంలో విజిటర్స్ ఫెసిలిటీ సెంటర్

కంటోన్మెంట్, వెలుగు: బొల్లారం రాష్ట్రపతి నిలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘విజిటర్స్​ఫెసిలిటీ సెంటర్’​ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు. అక్కడి గార్డెన్​లో పచ్చని మొక్కలతో రూపొందించిన గడియారాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రపతి నిలయం గొప్ప వారసత్వ సంపద అన్నారు. ఇక్కడి ప్రాధాన్యాన్ని ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో సందర్శనకు అనుమతి ఇచ్చారని తెలిపారు. 

అనంతరం రాష్ట్రపతి నిలయం సందర్శకులకు అందుబాటులోకి వచ్చి యేడాది పూర్తయిన సందర్భంగా ‘యాన్యువల్​క్రానికల్స్​ఆఫ్​రాష్ట్రపతి నిలయం– ఏ ఇయర్​విత్​ ప్రెసిడెంట్​ద్రౌపది ముర్ము’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. వీకెండ్స్​లో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తామని రాష్ట్రపతి నిలయం సెక్రటరీ రాజేశ్ వర్మ చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా 8న హెరిటేజ్​సారీ వాక్, లిటరరీ ఫెస్టివల్​నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్​కలెక్టర్ అనుదీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.