Good Health : ఒత్తిడి, టెన్షన్ తగ్గించే విటమిన్ ఫ్రూట్స్ ఇవే

Good Health : ఒత్తిడి, టెన్షన్ తగ్గించే విటమిన్ ఫ్రూట్స్ ఇవే

మూడ్స్ ని కంట్రోల్ చేయడంలో, మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా చూడడంలో విటమిన్ బి6 (పైరిడాక్సిన్) బాగా పనిచేస్తుంది. అంతేకాదు శరీరం ప్రోటీన్లని గ్రహించడంలో కూడా సాయపడుతుంది. విటమిన్ బి6 లోపం ఏర్పడకుండా ఏమేం తినాలంటే...

  •  విటమిన్ బి6 క్యారెట్లలో ఎక్కువగా ఉంటుంది. శరీరానికి అవసరమైన ఫైబర్ తోపాటు కళ్లని ఆరోగ్యంగా ఉంచే విటమిన్ - ఎ కూడా క్యారెట్లలో దొరుకుతుంది.
  •  విటమిన్ బి6 కోసమే కాకుండా బరువు తగ్గాలి అనుకునేవాళ్లు రోజుకొక అరటిపండు తినాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ హెల్ కు మంచివి.
  •  పాలకూరలో విటమిన్ బి6తో పాటు ఐరన్, ఫోలేట్, పొటాషియం వంటి న్యూట్రియెంట్స్ ఉంటాయి. 
  •  చలికాలంలో పాలకూర రెగ్యులర్ గా తింటే ఆరోగ్యం కూడా బాగుంటుంది.
  •   చలికాలంలో గుడ్లు తింటే ఒళ్లంతా వెచ్చగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ ఆమ్లెట్ లేదా ఉడకబెట్టిన గుడ్లు తింటే విటమిన్ బి6 లోపం ఏర్పడదు.
  •   పచ్చి బఠాణీల్లో విటమిన్ బి6 ఎక్కువ. వీటిని సలాడ్స్ లేదా సైడ్ డిష్ క్యారెట్లు, ఆలుగడ్డలతో కలిపి తినొచ్చు కూడా.
  •   క్యాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్ నట్స్, అవకాడోలో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో హార్మోన్లు కూడా బ్యాలెన్స్ అవుతాయి. 
  •  టొమాటోలో విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. ఇవి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి కూడా. 
  •  అలాగే టొమాటోలో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
  •  అతి తక్కువ కేలరీలుండే కీరదోసలో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల డీ హైడ్రేషన్ దరిచేరదు. మెటబాలిజంకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు. ఒబెసిటీ నుంచి బయటపడొచ్చు.
  •  బీన్స్ ని రెగ్యులర్ గా తింటే బి6 లోపం దరిచేరదు. అలాగే వీటిల్లోని జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం, విటమిన్-ఇ, కె లు షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేసి మూడ్ స్వింగ్స్ కు బ్రేక్ వేస్తాయి.
  •  శెనగలు, చేపలను డైట్ లో చేర్చినా బి6 లోపం నుంచి తప్పించుకోవచ్చు.
  •  పుదీనాని జ్యూస్ లేదా ఏదైనా కూరల్లో వేసుకుని తింటే బి6 లోపం రాదు. 
  •  అలాగే పుదీనా తినడం వల్ల విటమిన్-సి, విటమిన్-ఇ, విటమిన్ -కె వంటి విటమిన్లు, క్యాల్షియం కూడా శరీరానికి అందుతాయి.
  •  స్వీట్ పొటాటో, కార్న్ లోనూ విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది.
  •  రోజూ పాలు తాగితే కూడా విటమిన్ బి6 తగ్గకుండా చూసుకోవచ్చు.
  •  అలాగే చికెన్ లివర్ తిన్నా విటమిన్ బి6 తో పాటు ఫోలేట్, ఐరన్ వంటివి దొరుకుతాయి.