కొత్తగూడెం, తాటిచెర్ల మైనింగ్ లో కుంభకోణం

కొత్తగూడెం, తాటిచెర్ల మైనింగ్ లో కుంభకోణం

కొత్తగూడెం,తాటిచెర్ల మైనింగ్ లో ఏడాదికి రూ.20వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జెన్కో ను కాపాడి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.విద్యుత్ కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.ఉద్యమ సమయంలో ఏ సంస్థను ప్రైవేటీకరణ చేసేది లేదని చెప్పిన కేసీఆర్.. సీఎం అయ్యాక అన్నింటిని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు.హైదరాబాద్ లో కొత్తగూడెం జెన్కో ఎంప్లాయీస్ యూనియన్ క్యాలెండర్ ను వివేక్ వెంకటస్వామి రిలీజ్ చేశారు.

మరిన్ని వార్తలు

సీఎంగా ఎవరున్నా.. చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తా

6న ఏపీ టెన్త్‌ ఫలితాల విడుదల