పదేండ్లైనా ప్రజల బతుకులు మారలే: వివేక్ సరోజ

పదేండ్లైనా ప్రజల బతుకులు మారలే: వివేక్ సరోజ

కోల్ బెల్ట్: తెలంగాణ వచ్చి పదేండ్లు గడుస్తున్న గ్రామాల్లో ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పు లేదని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజా వివేక్ అన్నారు. కూలిపోతున్న ఇండ్లలో, కనీస సౌలతుల్లేని ప్రాంతాల్లో దుర్బరమైన జీవితాన్ని సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలోని నార్లపూర్ గ్రామంలో వివేక్ వెంకటస్వామి తరపున జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. 

ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ ఊర్లో ఎక్కడ చూసినా రోడ్లు, డ్రైనేజీలు, ఇండ్లు శిథిలావస్థకు చేరాయన్నారు. ఇక్కడి ప్రజలను చూస్తే బాధేస్తుందని.. వీరి సమస్యలను తీర్చడంలో బాల్క సుమన్ నిర్లక్ష్యం చేశాడని మండిపడ్డారు. రాక్షసుడిలాగా మారి ప్రజల రక్తాన్ని తాగుతున్నాడని ఫైర్​అయ్యారు.