Vodafone Idea: 28 రోజుల వ్యాలిడిటీతో వోడాఫోన్ ఐడియా సరికొత్త ప్లాన్.. వివరాలివిగో..

Vodafone Idea: 28 రోజుల వ్యాలిడిటీతో వోడాఫోన్ ఐడియా సరికొత్త ప్లాన్.. వివరాలివిగో..

వోడాఫోన్ ఐడియా సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను ప్రారంభించింది. ఇది 28 రోజుల వరకు వ్యాలిడిటీని అందిస్తుంది.ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే తగినంత డేటాను పొందవచ్చు. ఇది కాకుండా వోడాఫోన్ ఐడియా  కంపెనీ అనేక రీఛార్జ్ ప్లాన్లతో అదనపు డేటాను కూడి అందిస్తోంది. అన్ లిమిటెడ్ ఆఫర్లతో వినియోగదా రుల కు రాత్రి ఇంటర్నెట్ డేటా అందిస్తుంది. వోడాఫోన్ ఐడియా అందిస్తున్న సరికొత్త రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. 

Vi ప్రీపెయిడ్ రూ.118 రీఛార్జ్ ప్లాన్ 

వోడాఫోన్ ఐడియా సరికొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ రూ.118ని లాంచ్ చేసింది. ఈ ప్రీపెయిడ్ వాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఇందులో వినియోగదారులు 12GB డేటాను పొందవచ్చు. ఇది డేటా ప్లాన్ మాత్రమే.వినియోగదారులు  ఇప్పటికే అమలులో ఉన్న ఏదైనా ప్లాన్ తో ఈ ప్లాన్ ని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ లో కస్టమర్లు ఉచిత కాలింగ్ బెనిఫిట్స్ పొందలేరు.  

Vi ప్రీపెయిడ్ రూ.125 రీఛార్జ్ ప్లాన్ 

Vi ప్రీపెయిడ్ రూ.118 రీఛార్జ్ ప్లాన్ తో పాటు రూ.125 విలువైన మరో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ని ప్రారంభించింది. ఇది కూడా 28 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు1 G డేటా వస్తుంది. 

Vi ప్రీపెయిడ్ రూ.181 రీఛార్జ్ ప్లాన్ 

ప్రతి రోజూ1.5GB డేటాతో వోడాఫోన్ ఐడియా  రూ. 181 విలువైన మరో ప్రీపెయిడ్ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ గడువు 30 రోజులు. 

వోడాఫోన్ ఐడియా  అందించే రూ.100 కంటే తక్కువ డేటా ప్లాన్లు 

వోడాఫోన్ ఐడియా రూ. 75 విలువైన రీచార్జ్ ప్లాన్ ను అందిస్తోంది. ప్లాన్ వాలిడిటీ వారం రోజులు, 6GB డేటాను అందిస్తుంది. ఇది కాకుండా రూ. 49 ప్లాన్ లో 20 GB డేటాను అందిస్తోంది. అయితే వాలిడిటీ ఒక రోజు మాత్రమే. 

ఇంకా వోడాఫోన్ ఐడియా రూ.39 విలువైన డేటా ప్లాన్ లో 3GB అదనపు డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ మూడు రోజులు మాత్రమే ఉంటుంది.