రేపటి నుంచి ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

 రేపటి నుంచి ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

అమరావతి:  ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు రేపు ఉదయం అంటే శనివారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 19వ తేదీ వరకు ఉత్సవాలు వైభవంగా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహించిన విషయం తెలిసిందే. కరోనా  ప్రభావం పూర్తిగా తొలగిపోవడంతో ఈ ఏడాది ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది.
రామయ్య బ్రహ్మోత్సవాలకు రండి: సీఎం జగన్ కు టీటీడీ ఈవో ఆహ్వానం
ఏప్రిల్ 9 నుంచి 19 వ తేదీ వరకు నిర్వహించే ఒంటిమిట్ట కోదండ రామ స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, డిప్యూటి ఈవో  రమణ ప్రసాద్  ఆహ్వానించారు. శుక్రవారం తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సిఎం జగన్ ను కలసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదాలు అందజేశారు. కాగా ఈ నెల 15 రాత్రి 8 గంటల నుంచి 10 గంటలలోపు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉంది. 

 

ఇవి కూడా చదవండి

డీజిల్ సెస్ పేరుతో మరోసారి ఆర్టీసీ చార్జీల భారం

టీఆర్ఎస్ ధర్నాలో మున్సిపల్ ఛైర్ పర్సన్కు అవమానం

ఏపీ పునర్విభజనపై సుప్రీంకోర్టులో ఉండవల్లి పిటిషన్