పక్కాగా నామినేషన్ల ప్రక్రియ : కలెక్టర్ ఆదర్శ్ సురభి

పక్కాగా నామినేషన్ల ప్రక్రియ : కలెక్టర్  ఆదర్శ్  సురభి

వనపర్తి, వెలుగు: గ్రామపంచాయతీ నామినేషన్  ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు జరగకుండా సజావుగా నిర్వహించాలని వనపర్తి కలెక్టర్  ఆదర్శ్  సురభి ఆదేశించారు. గురువారం గోపాల్​పేట మండలంలోని తాడిపర్తి, బుద్ధారం, పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి, వీరాయిపల్లి గ్రామపంచాయతీల్లో నామినేషన్​ స్వీకరణ కేంద్రాలను కలెక్టర్  పరిశీలించారు.  

వీరాయపల్లిలో ఎన్నికల జనరల్  అబ్జర్వర్  మల్లయ్య బట్టు, వ్యయ పరిశీలకులు శ్రీనివాస్, అడిషనల్​  కలెక్టర్  యాదయ్యతో కలిసి నామినేషన్  కేంద్రాన్ని తనిఖీ చేశారు. నామినేషన్  ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. 

ప్రతి రోజు నామినేషన్ల స్వీకరణ అనంతరం సాయంత్రం టీ పోల్  యాప్ లో అప్​డేట్  చేయాలని సూచించారు. నామినేషన్  దాఖలు చేసే అభ్యర్థితో పాటు ఒక ప్రపోజర్​ మరో వ్యక్తిని మాత్రమే రిటర్నింగ్  అధికారి గదిలోకి అనుమతించాలని సూచించారు. గోపాల్​పేట, పెద్దమందడి తహసీల్దార్లు తిలక్ రెడ్డి, పాండు నాయక్, ఎంపీడీవోలు ఆయేషా, తాళ్ల పరిణత ఉన్నారు.