- మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్
వనపర్తి, వెలుగు : వనపర్తి ఎమ్మెల్యేగా మేఘారెడ్డి గెలిచాక పట్టణాభివృద్ధి కోసం రూ.50 కోట్ల నిధులు తీసుకొచ్చారని వనపర్తి వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత పదేండ్లలో వనపర్తి పట్టణం అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
అస్తవ్యస్తమైన రోడ్లు, డ్రైనేజీలు ఉండడంతో ఎమ్మెల్యే మేఘారెడ్డి గమనించి నిధులు తీసుకొచ్చారని తెలిపారు. మర్రికుంట అలుగుపై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అవగాహన రాహిత్యమన్నారు. సమావేశంలో వనపర్తి సెగ్మెంటు సమన్వయకర్త సతీశ్, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు చీర్ల చందర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు కృష్ణయ్య, బి.కృష్ణ పాల్గొన్నారు.
