ముదురుతున్న కరెంట్​ కయ్యం .. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం

ముదురుతున్న కరెంట్​ కయ్యం .. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘కరెంట్’ టాపిక్​ కాక రేపుతున్నది. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం రాజేస్తున్నది. కాంగ్రెస్​అధికారంలోకి వస్తే కరెంట్​ ఉండదని, మూడు గంటల కరెంట్​ కావాల్నో.. 24 గంటల కరెంట్​ కావాల్నో తేల్చుకోవాలంటూ బీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్​ సహా ఆ పార్టీ నేతలంతా ప్రచార సభల్లో అంటున్నారు. దీనికి దీటుగా పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి సహా కాంగ్రెస్​ నేతలు కూడా కౌంటర్​ ఇస్తున్నారు. 

రైతులకు ఉచిత కరెంట్​ ఇవ్వాలన్న ఆలోచన చేసిందే కాంగ్రెస్​ అని, అమలు చేసింది కూడా కాంగ్రెస్సేనని అంటున్నారు. బీఆర్​ఎస్​ చెప్తున్న 24 గంటల ఉచిత కరెంట్ రాష్ట్రంలో ఎక్కడా లేదని, ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ప్రకటిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా 24 గంటలు నాణ్యమైన కరెంట్​ను ఫ్రీగా రైతులకు సరఫరా చేస్తామని, బీఆర్​ఎస్​ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్తున్నారు.