హనుమకొండలో చోరీలు చేస్తున్న ఐదుగురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌

హనుమకొండలో చోరీలు చేస్తున్న ఐదుగురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌

హనుమకొండ, వెలుగు : ఇండ్లలో చోరీలు చేస్తున్న ముఠాను వరంగల్‌‌‌‌‌‌‌‌ సీసీఎస్‌‌‌‌‌‌‌‌, హనుమకొండ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ అలంకార్‌‌‌‌‌‌‌‌ సమీపంలోని కాకతీయ కాలనీలో వెహికల్‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌ సర్వీసింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ఎండీ.అఫ్జల్‌‌‌‌‌‌‌‌పాషా అలియాస్​ లొట్టి, షేక్‌‌‌‌‌‌‌‌ అస్లాం, పాత ఇనుప సామాను వ్యాపారం చేసే ఎండీ.షాహెద్, ఏసీ మెకానిక్‌‌‌‌‌‌‌‌ ఎండీ ఫహీం అక్రం, చికెన్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ నడిపే ఎండీ.గౌస్‌‌‌‌‌‌‌‌పాషా ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌. వీరు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌‌‌‌‌లు వేయడంతో పాటు, జల్సాలకు అలవాటుపడ్డారు.

ఆదాయం సరిపోకపోవడంతో దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌ నుంచి హనుమకొండ, కేయూ, కాజీపేట స్టేషన్ల పరిధిలోని పలు ఇండ్లలో చోరీలు చేశారు. చోరీ తర్వాత డాగ్‌‌‌‌‌‌‌‌స్క్వాడ్‌‌‌‌‌‌‌‌, క్లూస్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు దొరకకుండా ఇంట్లో మొత్తం కారం చల్లేవారు. చోరీ చేసిన సొత్తును రఫీఖ్‌‌‌‌‌‌‌‌, రెహానా బేగంకు ఇచ్చేవారు. బాధితుల ఫిర్యాదుతో వరంగల్‌‌‌‌‌‌‌‌ సీసీఎస్‌‌‌‌‌‌‌‌, హనుమకొండ పోలీసులు సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా నిందితులను గుర్తించారు.

మంగళవారం రాత్రి హనుమకొండ చౌరస్తాలో తిరుగుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.19 లక్షల విలువైన బంగారు, వెండి నగలు, 4 స్మార్ట్​ ఫోన్లు, ఒక బైక్, చోరీకి ఉపయోగించే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. రఫీఖ్‌‌‌‌‌‌‌‌, రెహానా బేగం పరారీలో ఉన్నారు. నిందితులను పట్టుకున్న క్రైమ్స్‌‌‌‌‌‌‌‌ డీసీపీ డి.మురళీధర్, ఏసీపీ బి.మల్లయ్య, సీఐలు బి.శంకర్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌, కరుణాకర్‌‌‌‌‌‌‌‌ను సీపీ అంబర్‌‌‌‌‌‌‌‌ కిశోర్‌‌‌‌‌‌‌‌ ఝా అభినందించారు.