
న్యూఢిల్లీ, వెలుగు: వరంగల్మామునూరు ఎయిర్ పోర్ట్ పనులు స్పీడప్ చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కోరారు.
మంగళవారం వారు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి మామునూరు ఎయిర్ పోర్ట్ కు ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఎయిర్ పోర్ట్ పనులు వేగవంతం చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. భారీ విమానాల రాకపోకలకు వీలుగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని రిక్వెస్ట్ చేశారు. ఈ సందర్భంగా.. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు మంజూరు చేసిందని నేతలు గుర్తుచేశారు.