వరంగల్ జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికను 65 ఏళ్ల వృద్దుడు గర్భవతిని చేశాడు.13 సంవత్సరాల బాలికపై సాంబయ్య(65) లైంగిక దాడి చేశాడు. బాలిక కడుపునొప్పితో బాధపడుతుండటంతో తల్లి వరంగల్ లోని సికేఏం ఆసుపత్రికి తీసుకువచ్చింది. డాక్టర్లు యువతి 4నెలల గర్భవతిగా నిర్థారించారు. దీంతో తల్లి ఒక్కసారిగా షాక్ కు గురైంది. విషయం తెలిశాక.. బాలిక కుటుంబ సభ్యులు గీసుగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.