హ్యాట్సాఫ్ సుమతి.. రైల్వే ట్రాక్‌పై పడుకున్న వ్యక్తిని కాపాడిన లేడీ ఆర్పీఎఫ్ సిబ్బంది

 హ్యాట్సాఫ్ సుమతి.. రైల్వే ట్రాక్‌పై పడుకున్న వ్యక్తిని కాపాడిన లేడీ ఆర్పీఎఫ్ సిబ్బంది

పశ్చిమ బెంగాల్‌లోని రైల్వే స్టేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సిబ్బంది ఒక ప్రయాణికుడిని ప్రమాదం నుంచి రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఆర్పీఎఫ్ ఇండియా తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై నిలబడిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా ట్రాక్‌పైకి వచ్చి పడుకున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. అతను ట్రాక్‌పై తల పెట్టి పడుకున్నాడు. ఈ పనిని ఆ వ్యక్తి కావాలనే చేసినట్టు వీడియో ద్వారా తెలుస్తోంది. అంతలోనే కానిస్టేబుల్ కె సుమతి ఆ వ్యక్తిని రక్షించడానికి పరుగెత్తింది. సమయానికి అతన్ని లాగి, కాపడం చూడవచ్చు. ఈ సమయంలో ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా సుమతికి సహాయం చేయడానికి వచ్చారు. ఈ ఘటన పుర్బా మేదినీపూర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.

పూర్వా మేదినీపూర్ రైల్వే స్టేషన్‌లో రైలు రావడానికి కొన్ని క్షణాల ముందు లేడీ కానిస్టేబుల్ సుమతి నిర్భయంగా ఒక వ్యక్తిని ట్రాక్‌పై నుండి లాగడం ఆమె నిబద్ధతకు నిదర్శనమని ఆర్పీఎఫ్ ఇండియా క్యాప్షన్ ను జోడించింది. ప్రయాణికుడిని రక్షించిని ఆర్పీఎఫ్ సిబ్బందిని పలువురు ప్రశంసించారు. ఆమెకు ఉద్యోగం పట్ల గొప్ప అంకితభావం ఉందని కొందరు వ్యాఖ్యానించగా, ఆమె త్వరగా స్పందించినందుకు అభినందనలు అంటూ మరికొందరు కొనియాడారు. హృదయానికి హత్తుకునే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://twitter.com/RPF_INDIA/status/1666705743280734208