పాండవులగుట్టకు యునెస్కో గుర్తింపు కోసం కృషి 

పాండవులగుట్టకు యునెస్కో గుర్తింపు కోసం కృషి 

భూపాలపల్లి జిల్లా: వేయి స్తంభాల గుడి, పాండవుల గుట్టలాంటి చారిత్రక ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు కోసం కృషి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాండవుల గుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని పాండవులగుట్టను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. గుట్టపై మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే.. పర్యాటకులు వస్తారని అభిప్రాయపడ్డారు. పాండవుల గుట్ట గురించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. అప్పుడే రామప్పకు వచ్చిన పర్యాటకులు.. పాండవుల గుట్టకు కూడా వస్తారని చెప్పారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించిన సినీనటి వరలక్ష్మి శరత్ కుమార్

డబుల్ బెడ్రూం ఇళ్లపై 2 నెలల్లో నివేదిక ఇవ్వండి

ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాం