వారఫలాలు ( సౌరమానం) ఏప్రిల్ 14  నుంచి 20  వరుకు 

వారఫలాలు ( సౌరమానం) ఏప్రిల్ 14  నుంచి 20  వరుకు 

మేషం : రావలసిన సొమ్ము అందుతుంది. స్థిరాస్తి వివాదాలు కొంతమేర పరిష్కారం. మీ సత్తా అందరిలోనూ చాటుకుని ప్రశంసలు పొందుతారు. విద్యావకాశాలు మరింతగా దక్కించుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం. గృహ, వాహనయోగాలు కలిగే సూచనలు. నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు లభించవచ్చు. ప్రత్యర్థులు అనుకూలురుగా మారవచ్చు. వ్యాపారులకు ప్రోత్సాహకరం. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కే అవకాశం. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు గుర్తింపు.

వృషభం : జీవితాశయం సాధించే దిశగా ముందడుగు. ఆదాయం పెరుగుతుంది. భూవివాదాల పరిష్కారం. పెండింగ్​లో ఉన్న కోర్టు వ్యవహారం కొలిక్కి వస్తుంది. వాహనయోగం. విద్యార్థుల యత్నాలు సఫలం. మీ అభిప్రాయాలతో కుటుంబసభ్యులు ఏకీభవిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలం. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులు, పరిశోధకులు, రాజకీయవేత్తలకు సన్మానయోగం.

మిధునం : ముఖ్యమైన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. మీ నిర్ణయాలపై కుటుంబంలో అనుకూలత. సకాలంలో రావలసిన డబ్బు సమకూరుతుంది. భూములు, వాహనాలు కొంటారు. గతంలో చేజారిన కొన్ని  డాక్యుమెంట్లు తిరిగి దక్కే అవకాశం. వ్యాపారులకు కోరుకున్న లాభాలు. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులు నైపుణ్యతను చాటుకుంటారు.

కర్కాటకం : చేపట్టిన కార్యక్రమాలను పూర్తి చేసేవరకూ విశ్రమించరు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. గౌరవానికి లోటు రాదు. అనుకున్న రాబడి. ఒత్తిడుల నుంచి బయటపడతారు. వ్యతిరేకులను మీవైపు ఆకట్టుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో లబ్ధి పొందుతారు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు. వ్యాపారులు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు ఉత్సాహవంతమైన సమయం.

సింహం :  క్రమేపీ మిమ్మల్ని అంతా ఇష్టపడతారు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి. ఆదాయం పెరిగి అప్పులు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. మాటలతో అందర్నీ ఆకట్టుకుంటారు. వాహన, గృహ కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. నిరుద్యోగులకు ఎదురుచూస్తున్న అవకాశాలు దక్కుతాయి. వ్యాపారులకు ఊహించని పెట్టుబడులు. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగులు సత్తా నిరూపించుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులు, వైద్యుల కృషి ఫలిస్తుంది.

కన్య : చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారే సమయం. ఆదాయం పెరుగుతుంది. పోటీపరీక్షలపై విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు చివరి దశకు చేరతాయి. గృహ నిర్మాణాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. చేపట్టిన కార్యాలు విజయవంతం. కొత్త వ్యక్తుల పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపారులకు ఆశించిన పెట్టుబడులు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే.

తుల : అనుకున్న కార్యాలు దిగ్విజయం. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆదాయం కొంత పెరిగి అవసరాలు తీరతాయి. విద్య,ఉద్యోగావకాశాలు దక్కుతాయి. సోదరులు, సోదరీలతో వివాదాల పరిష్కారం. ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. వ్యాపారులకు ఆశించిన పెట్టుబడులు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు అనుకూలం.

వృశ్చికం : ముఖ్య కార్యాలు సజావుగా పూర్తి. రాబడికి లోటు ఉండదు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం.  ఆలోచనలకు కార్యరూపం. వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాల సూచన. స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కారం. వాహన, గృహ యోగాలు. వ్యాపారులు నష్టాలను అధిగమిస్తారు. ఉద్యోగులకు సహచరుల సాయం. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు.

ధనుస్సు : ఆత్మీయులు, బంధువుల ప్రోద్బలంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆశించిన ఆదాయం. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం. ఆలోచనలు కలసివస్తాయి. అందరిలోనూ మీమాటే నెగ్గుతుంది. ఆస్తుల వ్యవహారాలలో గందరగోళం తొలగుతుంది. శత్రువులు కూడా విధేయత చూపుతారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై సన్నద్ధం. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు పదోన్నతులు  రావచ్చు. పారిశ్రామిక, సాంకేతిక వర్గాలు, కళాకారులకు ఊహించని అవకాశాలు.

మకరం : కొన్ని కార్యాలు కుటుంబసభ్యుల సాయంతో పూర్తి. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. సమాజంలో పలుకుబడి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులకు ఆహ్వానాలు.

కుంభం : ఆదాయానికి లోటు లేకున్నా అవసరాలకు అప్పులు చేస్తారు. చేపట్టిన కార్యాలు విజయవంతం. సోదర, సోదరీలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కొలిక్కి వస్తాయి. ప్రముఖ వ్యక్తుల పరిచయం. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు. వ్యాపారులకు గతం కంటే ఎక్కువ లాభాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు ఆశాజనకం.

మీనం : వ్యయప్రయాసలు లెక్కచేయరు. చేపట్టిన కార్యాలు సమయానికి పూర్తి. ఆలోచనలకు కార్యరూపం. ఆత్మీయుల సలహాల మేరకు నిర్ణయాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు కోరుకున్న అవకాశాలు. ప్రముఖ వ్యక్తులు పరిచయం. మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. రెండుమూడు విధాలుగా ధనలాభ సూచన. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులు విధి నిర్వహణలో సత్తా చాటుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు విదేశీ పర్యటనలు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400