వారఫలాలు: జూన్ 29 నుంచి జులై 5 వ తేదీ వరకు

వారఫలాలు: జూన్ 29 నుంచి  జులై 5 వ తేదీ  వరకు

ఆషాఢమాసం మొదలైంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( జూన్​29  నుంచి జులై5 వ తేది  వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం. 

మేష రాశి : ఈ రాశి వారికి ఈ వారం అనుకున్న పనులు సకాలంలో   పూర్తవుతాయి.  గతంలో రావలసిన బకాయిలు వసూలవుతాయి. వ్యాపారస్తులకు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయమని పండితులు సూచిస్తున్నారు.   వ్యాపారంలో ఆర్థికంగా ముందడుగు వేస్తారు. . ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది.  ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ప్రేమ  వ్యవహారాల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. . 

వృషభ రాశి: ఈ రాశివారికి ఈ వారం సమాజంలో గుర్తింపు పొందుతారు.  తోటి ఉద్యోగులు.. ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తాయి.  ఆరోగ్య విషయంలో  శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. వివాహాది శుభకార్యాలకు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అన్నివిధాలా బాగుంటుంది.  కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. 

మిథున రాశి:  ఈ రాశి వారు కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  అయితే కొన్ని అనవసర ఖర్చులు భరించాల్సి ఉంటుంది.  తలపెట్టిన పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయి. వ్యాపారస్తులకు.. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.  ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

కర్కాటక రాశి:  ఈ రాశి వారికి  గతంలో రావలసిన బకాయిలు అందుతాయి. రుణాల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.  ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.  వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఉద్యోగులు మీ పని మీరు చేసుకోండి.. ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  . ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనండి.. అంతా మంచే జరుగుతుంది. 

సింహ రాశి:  ఈ రాశి వారికి అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.  కొత్త ఉద్యోగంలో చేరాలనుకొనే వారు శుభవార్త  వింటారు.  వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలుంటాయి. జీవిత భాగస్వామిని ఆలోచించి నిర్ణయం తీసుకోండి.  నిరుద్యోగులు గుడ్​ న్యూస్​ వింటారు. 

కన్యారాశి: ఈ రాశి వారికి ఈ వారం  అన్ని విధాలుగా మిశ్రమ ఫలితాలుంటాయి.   ఆదాయం పెరిగేందుకు అవకాశం ఉంది.  అయితే ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉందని పండితులు అంటున్నారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది.  ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.  అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆస్తుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక విషయాల్లో ఎలాంటి మార్పులు ఉండవు..

తులారాశి: ఈ రాశి వారు ఈ వారం వివాదాలకు దూరంగా ఉండండి.  ఇతరులతో సంభాషించే విషయంలో జాగ్రత్తలు పాటించండి. పాత మిత్రులు కలిసే అవకాశం ఉంది.  శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగస్తులకు .. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

వృశ్చిక రాశి:  ఈ రాశి వారికి ఈ వారం రావలసిన డబ్బు చేతికి అందుతుంది.  బంధువుల తాకిడితో ఖర్చులు పెరుగుతాయి.  వ్యాపారస్తులు గతంలో పెట్టిన పెడుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. పనుల్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. 

ధనుస్సురాశి:  ఈ రాశి వారు అనవసరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.  భూమి విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఊహించని ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతాయి.  వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  కుటుంబపెద్దల సలహాల.. సూచనలతో పనులు పూర్తవుతాయి.  ఇక ఉద్యోగులు ఆఫీసులో శాంతంగా ఉండండి.  ఎలాంటి వివాదాలజోలికి వెళ్లవద్దని పండితులు సూచిస్తున్నారు. 

మకర రాశి : ఈ రాశి వారు ఈ వారంలో కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. కుటుంబ పెద్దల సహకారంతో  కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులు గుడ్​న్యూస్​ వింటారు.   ఉద్యోగస్తులకు అన్ని విధాలాఅనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్​ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ప్రేమ... పెళ్లి విషయాలు అనుకూలిస్తాయి. 

కుంభ రాశి : ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో మొదట్లో కొంత గందరగోళం ఏర్పడుతుంది.  వారం మధ్యలో నుంచి క్రమేణ పూర్తవుతాయి.  కుటుంబసభ్యుల సహకారంతో మనశ్శాంతి లభిస్తుంది.  వివాదాలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. సహోద్యోగుల  సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.  ఆధ్యాత్మిక చింతనతో గడపండి... అంతా మంచే జరుగుతుంది. . .

మీనరాశి: ఈ రాశి వారు ఈ వారం ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి.  ఈ వారం మీరు తీసుకునే నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అయ్యే అవకాశం ఉంది.  బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.  ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం.... కీర్తి... ప్రతిష్ఠలు పెరుగుతాయి.