వార ఫలాలు ( సౌరమానం) : మార్చి 10 నుంచి 16 వరకు

వార ఫలాలు ( సౌరమానం) : మార్చి 10  నుంచి 16  వరకు

మేషం : కొన్ని కార్యాలు నిదానించినా ఎట్టకేలకు పూర్తి. ఆత్మీయులు, బంధువుల ప్రోద్బలంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం. మీమాటే నెగ్గుతుంది. ఆస్తుల వ్యవహారాల్లో గందరగోళం తొలగుతుంది. శత్రువులు మీపట్ల విధేయత చూపుతారు. శుభకార్యాల నిర్వహణపై సన్నద్ధం. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు పదోన్నతులు  రావచ్చు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలు, కళాకారులకు ఊహించని అవకాశాలు.

వృషభం :  ఆదాయానికి లోటు లేకున్నా అవసరాలకు అప్పులు చేస్తారు. చేపట్టిన కార్యాలు విజయవంతం. ఆస్తుల వ్యవహారాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కొలిక్కి వస్తాయి. ప్రముఖ వ్యక్తుల పరిచయం. వాహనయోగం. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు. వ్యాపారులకు గతం కంటే ఎక్కువ లాభాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు ఆశాజనకం.

మిథునం : చిరకాల ప్రత్యర్థులు స్నేహితులవుతారు. ఆదాయం పెరుగుతుంది. పోటీపరీక్షలపై విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం. స్థిరాస్తి వివాదాలు చివరి దశకు చేరతాయి. గృహ నిర్మాణాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. చేపట్టిన కార్యాలు విజయవంతం. కొత్త వ్యక్తుల పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపారులకు ఆశించిన పెట్టుబడులు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టిందల్లా బంగారమే.

కర్కాటకం :  ముఖ్యమైన కార్యాలు సకాలంలో పూర్తి. మీ నిర్ణయాలపై కుటుంబంలో అనుకూలత. సకాలంలో రావలసిన డబ్బు సమకూరుతుంది. భూములు, వాహనాలు కొంటారు. గతంలో చేజారిన కొన్ని  డాక్యుమెంట్లు తిరిగి దక్కే అవకాశం. మీ ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారులకు కోరుకున్న లాభాలు. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులు నైపుణ్యతను చాటుకుంటారు.

సింహం : జీవితాశయం సాధించే దిశగా ముందడుగు వేస్తారు. ఆదాయం పెరుగుతుంది. భూవివాదాలు కొంతమేర పరిష్కారం. దీర్ఘకాలికంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కోర్టు వ్యవహారం కొలిక్కి వస్తుంది. వాహనయోగం. విద్యార్థుల యత్నాలు సఫలం. మీ అభిప్రాయాలతో కుటుంబసభ్యులు ఏకీభవిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలించే సమయం. వ్యాపారులకి ఊహించని లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులు, పరిశోధకులు, రాజకీయవేత్తలకు సన్మానయోగం.

కన్య : ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి. అప్పులు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. వాహన, గృహ కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. స్నేహితులు చెప్పిన సమాచారం ఊరటనిస్తుంది. నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతాయి. వ్యాపారులకు ఊహించని పెట్టుబడులు. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగులు సత్తా నిరూపించుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులుయత్నాలు సఫలం.

తుల : అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. విద్య,ఉద్యోగావకాశాలు దక్కుతాయి. సోదరులు, సోదరీలతో వివాదాల పరిష్కారం. ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. వ్యాపారులకు ఆశించిన పెట్టుబడులు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు అనుకూలం.

వృచ్చికం : ముఖ్య కార్యాలు సజావుగా పూర్తి. రాబడికి లోటు ఉండదు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. ఆలోచనలకు కార్యరూపం. చీటికీమాటికీ వేధిస్తున్న సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. స్థిరాస్తి వివాదాల  పరిష్కారం. వాహన, గృహయోగాలు. వ్యాపారులు నష్టాలను అధిగమిస్తారు. ఉద్యోగులకు సహచరుల నుంచి సాయం. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

ధనస్సు : కొన్ని కార్యాలు కుటుంబసభ్యుల సాయంతో పూర్తి.  నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులకు ఆహ్వానాలు.

మకరం :  దూరమైన ఆప్తులు చేరువవుతారు. ఆలోచనలకు కార్యరూపం. రావలసిన సొమ్ము అందుతుంది. స్థిరాస్తి వివాదాలు కొంతమేర పరిష్కారం. విద్యావకాశాలు దక్కించుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. గృహ, వాహనయోగాలు కలిగే సూచన. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారవచ్చు. వ్యాపారులకు ప్రోత్సాహకరం. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కే అవకాశం. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు గుర్తింపు.

కుంభం : చేపట్టిన కార్యాలు సమయానికి పూర్తి. ఆలోచనలకు కార్యరూపం. ఆత్మీయుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కోరుకున్న అవకాశాలు. ప్రముఖ వ్యక్తుల పరిచయం.  మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. రెండుమూడు విధాలుగా ధనలాభ సూచన. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులు విధి నిర్వహణలో సత్తా చాటుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు విదేశీ పర్యటనలు.

మీనం : చేపట్టిన కార్యక్రమాలను పూర్తి చేసేవరకూ విశ్రమించరు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. అనుకున్న రాబడి పొంది ఒత్తిడుల నుంచి బయటపడతారు. వ్యతిరేకులను మీవైపుకు ఆకట్టుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో చిక్కులు పరిష్కరించుకుని లబ్ధి పొందుతారు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు. వ్యాపారులు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు ఉత్సాహవంతమైన సమయం.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400