వార ఫలాలు : 2024 మార్చి 17 నుంచి 23 వరకు

వార ఫలాలు : 2024 మార్చి 17 నుంచి 23 వరకు

మేషం : కార్యక్రమాలు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. తీర్థయాత్రలు చేస్తారు. అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఉద్యోగులు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. విధుల్లో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు సమకూరతాయి. రాజకీయవేత్తలకు అనుకున్న పదవులు దక్కించుకుంటారు.

వృషభం :  సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీ చెడ్డా విచారిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. రావలసిన సొమ్ము అంది అప్పులు తీరతాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు నూతనోత్సాహం. ప్రమోషన్లు దక్కే ఛాన్స్‌. పారిశ్రామికవేత్తలకు మెరుగైన అవకాశాలు దక్కుతాయి.

మిథునం : కార్యక్రమాలలో  అవరోధాలు. తరచూ ప్రయాణాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. నిరుద్యోగులు నిరాశ చెందుతారు. కొత్తగా అప్పులు చేస్తారు. శారీరక రుగ్మతలు. వ్యాపారులకు కొద్దిపాటి చికాకులు ఎదురుకావచ్చు. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనల్లో అవాంతరాలు. వారారంభంలో నూతన పరిచయాలు. విందు వినోదాలు.

కర్కాటకం :  ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆదాయం తగ్గి రుణాలు చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. చర్చల్లో ప్రతిష్టంభన. వ్యాపారులు పెట్టుబడులు అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగులకు అదనపు విధులు గందరగోళంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు అంతగా అనుకూలించదు. వారారంభంలో బంధువుల కలయిక. వస్తులాభాలు.

సింహం : ముఖ్యకార్యక్రమాలు ముందుకు సాగవు. కాంట్రాక్టులు చేజారతాయి. భూవివాదాలు నెలకొంటాయి. కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకోని ప్రయాణాలు.  అప్పులు చేయాల్సివస్తుంది. వ్యాపారులకు విస్తరణ చర్యలు ముందుకు సాగవు. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తత పాటించాలి. కళాకారులకు అవకాశాలు చేజారి నిరాశ మిగులుతుంది.  వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం.


కన్య : కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ చూరగొంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పరపతి పెరుగుతుంది. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. బాకీలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. భాగస్వామ్య వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవేత్తల నిరీక్షణ ఫలించే సమయం.

తుల : కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. తరచూ ప్రయాణాలు ఉంటాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. ధార్మిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహం కలిగించవచ్చు. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. పెట్టుబడులు అందక నిరాశ చెందుతారు. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి. వారారంభంలో శుభవార్తలు. వాహనయోగం.

వృచ్చికం : పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సమయానికి పూర్తి. ఆత్మీయులు, బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. వాహనాలు, స్థలాలు కొంటారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు. బాకీలు అందుతాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు అనుకున్న హోదాలు. రాజకీయవేత్తల యత్నాలు ఫలిస్తాయి.

ధనస్సు : అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ఆప్యాయత పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం. దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం. కళాకారులకు నూతనోత్సాహం.

మకరం :  ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. స్వామీజీలను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం. విద్యార్థులకు అనుకూల సమయం. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్లు. కళాకారులకు అవార్డులు రావచ్చు. 

కుంభం : కార్యక్రమాలలో ఆటంకాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. దేవాలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు అంతగా అనుకూలించవు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. విద్యార్థులు, నిరుద్యోగులకు కృషి ఫలించదు. రాబడి తగ్గి నిరాశ చెందుతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగవర్గాలకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు. శుభవార్తలు. వారాంతంలో ధనలాభం. వివాదాల పరిష్కారం.

మీనం : ఆలోచనలు నిలకడగా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆస్తి విషయాలలో తగాదాలు. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు. కుటుంబబాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి. రావలసిన సొమ్ము అందదు. భాగస్వామ్య వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు చేజారతాయి. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది.  వారం మధ్యలో విందు వినోదాలు. కార్యజయం.


వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400