వార ఫలాలు ( సౌరమానం) : మార్చి 31 నుంచి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 6 వరకు

వార ఫలాలు ( సౌరమానం) : మార్చి 31 నుంచి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 6 వరకు

మేషం : అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన రీతిలో రాబడి పెరుగుతుంది. శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు. కొత్త కాంట్రాక్టుల యత్నాలు సఫలం. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనే వీలుంది. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం. కొన్ని సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలు, కళాకారులు కొన్ని ఇబ్బందులు అధిగమిస్తారు.

వృషభం : కొన్ని  సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆశయాలు నెరవేరతాయి. కుటుంబంలో మీ మాటకు ఎదురుండదు. ఆలోచనలకు కార్యరూపం. విద్యార్థుల ప్రతిభ  వెలుగులోకి వస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు యత్నాలు కాస్త అనుకూలిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారులకు లాభాలు. పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. రాజకీయవర్గాలకు గుర్తింపు. క్రీడాకారులు, పరిశోధకులకు పరిస్థితులు అనుకూలిస్తాయి.

మిథునం : కొన్ని ముఖ్య నిర్ణయాలు కుటుంబసభ్యులను ఆశ్చర్యపరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు కొంత నిదానిస్తాయి. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరం. ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. విద్యార్థులు  సత్తా చాటుకుంటారు. వ్యాపారాల విస్తరణలో అడుగుముందుకు వేస్తారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులకు నూతనోత్సాహం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారుల శ్రమ ఫలిస్తుంది.

కర్కాటకం : ఆశయాలు నెరవేరతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. పలుకుబడి  కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు కొంటారు. నిరుద్యోగుల యత్నాల్లో కదలికలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. వివాహాది యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలకు గతం కంటే అనుకూలం. ఉద్యోగాలలో పనిభారం తగ్గే అవకాశం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులు అనుకున్నది సాధిస్తారు.

సింహం : కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల ఆదరణ, ప్రోత్సాహం అందుతాయి. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులకు నిరాశ తప్పకపోవచ్చు. వ్యాపారాలు క్రమేపీ అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరిగినా అధిగమించి ముందుకు సాగుతారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.

కన్య : ఆర్థిక విషయాలు అనుకూలం. కుటుంబంలో సమస్యలు అధిగమిస్తారు. కీలక సమాచారం అందుతుంది. కాంట్రాక్టర్లకు  కొంత అనుకూలత. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. కళాకారుల ప్రయత్నాలు కొంత సఫలం. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.

తుల : ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని విషయాలలో పట్టిందంతా బంగారమే అన్నట్లుంటుంది. కార్యసాధన, దీక్షాదక్షతలతో కార్యరంగంలోకి దిగి విజయం సాధిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలు, పరిశోధకులు, క్రీడాకారులకు కాస్త ఊరట.

వృచ్చికం : ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. జీవిత భాగస్వామితో వివాదాల సర్దుబాటు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం. విధుల్లో ప్రశంసలు. పారిశ్రామికవర్గాలు, వ్యవసాయదారులకు కొత్త ఆశలు. కళాకారులకు నిరాశ తొలగుతుంది.

ధనస్సు : ఎంతటి వారినైనా ఆకట్టుకునేందుకు యత్నించి సఫలమవుతారు. జీవితంలో మరపురాని సంఘటన ఎదురవుతుంది. బంధువులతో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగుతాయి. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుంటారు. మీ అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులు కొన్ని అవకాశాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకమే. వ్యాపారాలలో పురోగతి. ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పరిస్థితులు కాస్త అనుకూలిస్తాయి. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు కొత్త అవకాశాలు.

మకరం : రాబడి ఆశాజనకం. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ అంచనాలు నిజం కాగలవు. కార్యసాధన దిశగా ముందుకు సాగుతారు. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. సమాజంలో గౌరవం. పలుకుబడి పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. కళాకారులకు ఊరట లభిస్తుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తల అంచనాలు కొన్ని నిజమవుతాయి.

కుంభం : రాబడి సంతృప్తికరం. శుభకార్యాల నిర్వహణపై ఏర్పాట్లు. సేవలకు గుర్తింపు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారం. దూరపు బంధువులను కలుసుకుంటారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. అయినా సమర్థత చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. కళాకారులు, పరిశోధకులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

మీనం : ఆర్థిక విషయాలు ఊరటనిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. కొన్ని కార్యక్రమాల్లో విజయం. కాంట్రాక్టర్లకు అనుకూలం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. మీ నిర్ణయాలను అందరూ సమర్థిస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులు, పరిశోధకులకు అనుకూలం.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400