
- బొలేరో, ట్రక్కు ఢీకొని ప్రమాదం
పురులియా (బెంగాల్): బెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వెహికల్, ట్రక్కు ఢీకొని తొమ్మిది మంది మృతిచెందారు. పురులియా జిల్లాలోని 18వ నేషనల్హైవేపై నామ్షోల్ గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పెండ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో బొలెరోలో ఉన్న 9 మంది మృతిచెందారు. ప్రమాద తీవ్రతకు బొలేరో నుజ్జునుజ్జయింది. స్థానికులు, అత్యవసర సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే, వారంతా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు.