జూన్ 7 న వినాయకుడిని పూజిస్తే.. ఇక మీకు తిరుగే లేదు.. 

జూన్ 7 న వినాయకుడిని పూజిస్తే.. ఇక మీకు తిరుగే లేదు.. 

చాంద్రమానం ప్రకారం ప్రతీ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థిగా విశేషమైనది. ఈరోజున ( జూన్ 7)  వినాయక పూజ చేస్తే సర్వవిఘ్నాలు తొలగుతాయని నమ్మకం. గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్టు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి.    అయితే నేటికాలంలో వాటి అన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు. 

సంకష్ట చతుర్థి  ఉపవాసం జూన్ 7వ తేదీ. ఈ రోజున. గణేషుడి ఆశీర్వాదంతో మీ లక్  వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వినాయకుడు జ్ఞానము, బలము, ఐశ్వర్యము, సుఖము, అదృష్టములను ప్రసాదించువాడు. తన భక్తుల కష్టాలను తొలగించేవాడు. సంకష్ట చతుర్థి రోజున చంద్రుడిని పూజిస్తారు. ఈ సంకష్ట చతుర్థి నాడు రాత్రి 10:03 గంటలకు చంద్రోదయం జరుగుతుంది.  సంకష్టచతుర్థికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకుందాం.. 

సంకష్టహర చతుర్థికి పరిహారాలు..

మీరు మీ పిల్లల పురోగతిని కోరుకుంటే సంకష్ట హరి చతుర్ధి రోజు  ( జూన్ 7) ఏదైనా గణేష ఆలయానికి వెళ్లి, పిల్లలు లేదా ఆడపిల్లల చేతితో నువ్వులను దానం చేయండి. గణపతి అనుగ్రహం వల్ల జీవితంలో పురోగతి, విజయాలు లభిస్తాయి. సంకష్ట చతుర్థి నాడు వినాయకుని అనుగ్రహం లభించి కష్టాలు తొలగిపోవాలంటే పూజ సమయంలో ఈ కింది మంత్రాన్ని జపించాలి. గణేషుడు మీ కోరికలను తీరుస్తాడు.

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ: నిర్విఘ్నం.. కురుమిన్ దేవ్ సర్వ కార్వేషు సదా.

కుటుంబంలో ఆనందం ,శాంతితో పాటు సంపద పెరగాలనే కోరిక ఉంటుంది. మీకు అదే కోరిక ఉంటే, సంకష్ట హరి చతుర్ధి నాడు, వినాయకుడికి వెండి గిన్నెలో జాజికాయ, లవంగం, తమలపాకులు సమర్పించండి. మీ పని విజయవంతం అవుతుంది. . సంకష్ట చతుర్థి రోజున పూజా సమయంలో గణేశుడికి నెయ్యి దీపం వెలిగించాలి. గణేశుని అనుగ్రహంతో ఐశ్వర్యం, సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి.  వృత్తిలో పురోగతి, ప్రమోషన్ కోరుకునే వారు సంకష్టి చతుర్థి రోజున గణపతిను ధ్యానిస్తూ  అష్టముఖి(8 ముఖాల) రుద్రాక్షలను ధరించాలి.  ఏదైనా సమస్యతో బాధపడుతుంటే, సంకష్టి చతుర్థి రోజున నువ్వుల లడ్డూలను చేయండి. గణేషుడిని పూజించే సమయంలో  లడ్డూను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి. అప్పుల ఊబిలో చిక్కుకుని ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకష్టి చతుర్థి రోజున పూజా సమయంలో ఋణగ్రహీత గణేశ స్తోత్రాన్ని పఠించండి. ఇంకా ఏదైనా సమస్య చుట్టుముట్టినట్లయితే దాని నుండి బయటపడటానికి ఆచారాల ప్రకారం సంకష్టి చతుర్థి రోజు ఉపవాసం ఉండండి.  కష్టాలన్నీ తొలగిపోతాయి.

వ్రతం ఎలా చేయాలి


* సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి.
* ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి.
* . వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి, తరువాత గణపతిని పూజించాలి.
* అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణ చేయాలి.
* మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.
*  సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను.
*   ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి.
* తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి.
* శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును.
* సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు.
* సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి.
* నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.
ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం. 

సంకట హర చతుర్ధి వ్రత కథ:

ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు.

అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా!

అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు.

అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేషుని దూతని అపుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.

ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.