ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిన వాట్సప్, ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు

ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిన వాట్సప్, ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు

ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్  సేవలకు అంతరాయం కల్గింది.  వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు నిలిచిపోయాయి.  టెక్నికల్ సమస్యల వల్ల కొన్ని నిముషాల నుంచి  సేవలు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు ఇబ్బందిపడుతున్నారు.గతంలో స్తంభించిపోయినపుడు 5నుంచి 10 నిముషాల్లో తిరిగి వచ్చేవి. కానీ ఇవాళ దాదాపు 20 నిముషాల నుంచి వాట్సప్ సేవలు రావడం లేదు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్ సేవలను యాక్సెస్ చేయలేకపోతున్నామని సోషల్ మీడియా వినియోగదారులు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు.  లోపాన్ని సరిదిద్దేందుకు  ప్రయత్నిస్తున్నామని ఫేస్ బుక్ ప్రకటించింది.