UPI Down:దేశవ్యాప్తంగా నిలిచిపోయిన యూపీఐ సర్వీసులు

UPI Down:దేశవ్యాప్తంగా నిలిచిపోయిన యూపీఐ సర్వీసులు

దేశ ప్రజలంతా  నూతన సంవత్సర వేడుకల్లో ఉండగా..యూపీఐ పేమెంట్స్ నిలిచిపోయాయి. ప్రజలంతా షాపింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో యూపీఐ సేవలు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో యూపీఐకి ఏమైందంటూ ట్విట్టర్‌ లో గోల మొదలైంది. వేలాది మంది యూజర్లు #UPIDOWN అంటూ ట్వీట్లు చేస్తున్నారు.అయితే చాలా మందికి యూపీఐ డౌన్ (UPI Dowm) అయిందనే విషయం తెలియక పేమెంట్లు చేస్తున్నారు. దీంతో వేలాది రూపాయలు పేమెంట్ గేట్ వేలో ఇరుక్కుపోతున్నాయి. దీంతో వేలాదిగా ఫిర్యాదులు వస్తున్నాయి. 

యూపీఐ సేవ‌ల పున‌రుద్ధర‌ణ విష‌య‌మై ఎన్పీసీఐ నుంచి ఎటువంటి అధికారిక స‌మాచారం వెలువ‌డ‌లేదు. దీన్ని త్వరిత‌గ‌తిన ప‌రిష్కరించ‌కుంటే చాలా స‌మ‌స్యలు, ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. చాలా మంది యూపీఐ డౌన్ అయింద‌న్న స‌మాచారం తెలియ‌క పేమెంట్స్ చేస్తున్నారు. ఫ‌లితంగా వేల రూపాయ‌లు పేమెంట్ గేట్ వ‌ద్ద ఇరుక్కుపోవ‌డంతో వేల సంఖ్యలో ఫిర్యాదులు పోటెత్తుతున్నాయి. యూపీఐ స‌ర్వీసులు డౌన్ కావ‌డం ఫ‌స్ట్ టేం కాదు. కానీ కీల‌క‌మైన టైంలో స‌ర్వర్లు మొరాయిస్తుండ‌టం యూజ‌ర్లను చికాకు పెడుతున్నది.

డౌన్ డిటెక్టర్ డాట్ కామ్ స‌మాచారం ప్రకారం 60 శాతం మంది యూజ‌ర్లు యాప్‌తో స‌మ‌స్యలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. 30 శాతం మంది చెల్లింపుల్లో ఎర్రర్ చూపుతున్నద‌ని పేర్కొంటున్నారు. మ‌రో ప‌ది శాతం మంది న‌గ‌దు బ‌దిలీలో స‌మ‌స్యలు తలెత్తుతున్నాయ‌ని ఫిర్యాదు చేస్తున్నారు. దేశంలోని ప్రధాన న‌గ‌రాలైన ముంబై, బెంగ‌ళూరు, కోల్‌క‌తా, హైద‌రాబాద్‌, అహ్మదాబాద్‌, ఆగ్రా, ఢిల్లీ, చండీగ‌ఢ్‌ల్లో ఫిర్యాదులు త‌లెత్తుతున్నాయ‌ని తెలుస్తున్నది.