యువ‌తలో ముప్పు ఎక్కువే..క‌రోనా వాళ్ల‌కూ వ‌స్తుంది..వాళ్ల‌ను చంపేస్తోంది : డబ్ల్యూహెచ్ఓ

యువ‌తలో ముప్పు ఎక్కువే..క‌రోనా వాళ్ల‌కూ వ‌స్తుంది..వాళ్ల‌ను చంపేస్తోంది : డబ్ల్యూహెచ్ఓ

న్యూయార్క్: కరోనాకు యువత అతీతమేం కాదని, వాళ్ల‌కూ క‌రోనా ముప్పు ఎక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించిం ది. ‘‘కొన్నిదేశాల్లోయువత తమకేం కాదన్న నిర్ల‌క్ష్యంతో ఉంది.దీంతో ఆయా దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే, వాళ్ల‌కూ ముప్పు ఎక్కువేనని యువతను కన్విన్ స్చేయడమే ఇప్పుడు పెద్ద చాలెంజ్. యువతేం కరనోనాకు అతీతం కాదు. వాళకూ ్ల కరోనా సోకుతుంది. వాళ్ల‌నూ క‌రోనా చంపేస్తుంది. ఇతరులకు వాళ్లూ కరోనాను అంటిస్తారు. ఇది నిజం. కాబట్టి యువత తమను తాము రక్షించుకోవడంతో పాటు ఇతరులనూ రక్షించాల్సిన అవసరం ఎంతైనా
ఉంది. ఈ కరోనాపోరాటంలో యువతే లీడర్లు. వాళ్లే మార్పులకు కారకులు’’ అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ అన్నారు. కరోనాతో కలిసి బతకాల్సిందే. ‘కరోనా ఉంద ని బతుకులను వదిలేయలేం కదా’ అని టెడ్రోస్ అన్నారు. కరోనా ఎన్నెన్నో సవాళ్లు విసురుతోందని, అలాగని బతుకులకు స్టాప్ పెట్టడం కరెక్ట్ కాదని, అది జరిగి తీరాల్సిందేనని చెప్పారు. కొంచెం కష్టమైనా చేసి చూపించొచ్చన్నారు. కరోనాతో కలిసి బతకడం నే ర్చు కోవాల్సిందేనని తేల్చి చెప్పారు. వైరస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే వృద్ధులను కాపాడుకుంటూ బతుకు బండిని ముందుకు తీసుకెళ్లాల్సి న అవసరం ఉందన్నారు. ప్రపంచంలోని 40 శాతం మరణాలు ఎప్పటినుంచో వేరే జబ్బులతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వృద్ధులవేనని పేర్కొన్నారు. అందులో 80 శాతం మరణాలు ఒక్క అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఉన్నాయన్నారు. కరోనాకు సంబంధించి చాలా దేశాలు ప్రజలను కంట్రోల్లో పెట్టేందుకు ఫైన్లు వంటివి వసూలు చేస్తున్నాయనిఆయన చెప్పారు. ప్రజలను మార్చేందుకు ఎన్నెన్నో మార్గాలను ఆయా దేశాల ప్రభుత్వాలు ఎంచుకుంటున్నాయన్నారు. అందులో అవగాహన కల్పించడం ప్రధానమైన టూల్ అయితే.. చట్టాలు, ఆంక్షలు, గైడ్ లైన్స్, ఫైన్లూ మరికొన్నిటూల్స్ అని చెప్పారు. అయితే, ప్రజల్లో ఈ బిహేవియర్ను స్టడీ చేసేందుకు బిహేవియరల్ ఇన్ సెట్స్ అండ్ సైన్స్ ఆఫ్ హెల్తీ ఓ టెక్నికల్ అడ్వ‌జైర్ గ్రూప్ను ఏర్పాటు చేస్తున్నట్టు డబ్ల్యూహెచ్వో చీఫ్ వెల్ల‌డించారు. ఆ గ్రూఫ్ లో 16 దేశాలకు చెందిన 22 మంది ఎక్స్ పర్ట్స్ ఉంటారని చెప్పారు. వాళ్లంతా సైకాలజీ, ఆంత్రపాలజీ, హెల్త్ ప్రమోషన్, న్యూరోసైన్స్, బిహేవియరల్ ఎక‌నామిక్స్ , సోష‌ల్ మార్కెటింగ్ తదితర సెక్టార్ల‌లో నిపుణులని
వెల్లడించారు.