చన్నీని ఓడించిన లాభ్ సింగ్ ఎవరంటే..?

చన్నీని ఓడించిన లాభ్ సింగ్ ఎవరంటే..?

దేశమంతటా ప్రస్తుతం పంజాబ్ గురించి చర్చించుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం, సిట్టింగ్ సీఎం చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలవడం సంచలనంగా మారింది. పంజాబ్లోని బదౌర్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్ ముఖ్యమంత్రి చన్నీపై ఘన విజయం సాధించారు. దీంతో ప్రస్తుతం ఎటు చూసినా లాభ్ సింగ్ గురించే చర్చ నడుస్తోంది. 

పంజాబ్ సీఎం చరణ్ జీత్ చన్నీని ఓడించిన లాభ్ సింగ్ ఓ సాధారణ వ్యక్తి. తండ్రి డ్రైవర్, తల్లి స్వీపర్. 1987లో పుట్టిన ఆయన.. 12వ తరగతి వరకు చదువుకున్నారు. మొబైల్ రిపేర్ షాప్ నడిపిన లాభ్ సింగ్.. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో వాలంటీర్గా చేరాడు. బదౌర్ నియోజకవర్గంలో మొత్తం 74 గ్రామాలుండగా.. అక్కడ ఉన్న సమస్యలన్నీ తనకు తెలుసని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బదౌర్ ఓ నియోజకవర్గం కాదని, తన కుటుంబమని చెప్పారు. 2017 బదౌర్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి పిర్మల్ సింగ్ గెలిచినప్పటికీ గతేడాది ఆయన కాంగ్రెస్లో చేరారు. దీంతో ఆప్ ఆ టికెట్ను లాభ్ సింగ్కు ఇచ్చింది.

మరిన్ని వార్తల కోసం..

రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

మనోహర్ పారికర్ తనయుడి ఓటమి