మిస్ దివా యూనివర్స్ 2023 విజేతగా శ్వేతా శారద

మిస్ దివా యూనివర్స్ 2023 విజేతగా శ్వేతా శారద

మిస్ దివా యూనివర్స్ 2023 గ్రాండ్ ఫినాలే ఆగస్టు 27న ముంబైలో జరిగింది. శ్వేతా శారదా టైటిల్ గెలుచుకుంది. మిస్ దివా యూనివర్స్ 2022 దివితా రాయ్ ద్వారా మిస్ దివా యూనివర్స్ 2023 కిరీటాన్ని పొందింది. ఆమె ఇప్పుడు 72వ మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఢిల్లీకి చెందిన సోనాల్ కుక్రేజా మిస్ దివా సుప్రానేషనల్ 2023గా పేరు తెచ్చుకుంది. కర్ణాటకకు చెందిన త్రిష శెట్టి మిస్ దివా యూనివర్స్ 2023 రన్నరప్‌గా నిలిచింది. మిస్ సుప్రనేషనల్ 12వ ఎడిషన్‌లో కుక్రేజా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది.

శ్వేతా శారద ఎవరు?

చండీగఢ్‌లో జన్మించిన శ్వేతా శారదా.. 16 ఏళ్ల వయసులో ముంబైకి వెళ్లింది. 22 ఏళ్ల ఆమె ఒంటరి తల్లి వద్ద పెరిగింది. ఫెమినా ప్రకారం, శారదా CBSE బోర్డులో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా గ్రాడ్యుయేషన్‌ను కొనసాగిస్తోంది. శారదా ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఆమె జీవితంలో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రారంభ రోజుల్లో ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. ఫైనల్‌లో ప్రశ్నోత్తరాల రౌండ్‌లో, శ్వేతా శారదాను.. ఆమె జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి ఎవరు? అని నిర్వాహకులు అడగగా.. ఆమె తన తల్లి పేరు చెప్పి అందర్నీ ఆకర్షించింది. శ్వేతా.. డాన్స్ +, డ్యాన్స్ దీవానే, డీఐడీతో సహా పలు డాన్స్ రియాలిటీ షోలు చేసింది. ఆమె ఝలక్ దిఖ్లాజాలో కొరియోగ్రాఫర్‌గా కూడా భాగమైంది.

మిస్ దివా 2023 గురించి

అందాల పోటీ 11వ ఎడిషన్ లో వివాహితలు, విడాకులు పొందిన, గర్భిణీలు, వితంతువులు లేదా లింగమార్పిడి స్త్రీలను పోటీలోకి ఆహ్వానించి చరిత్రను లిఖించింది. మిస్ దివా 2023 గ్రాండ్ ఫినాలేలో ఫెమినా మిస్ ఇండియా 1980 సంగీతా బిజ్లానీ, ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 నందిని గుప్తా, మిస్టర్ వరల్డ్ 2016 రోహిత్ ఖండేల్వాల్, మిస్టర్ సుప్రానేషనల్ ఆసియా, ఓషియానియా 2017 అల్తమాష్ ఫరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సుప్రీత్ బేడీ, సచిన్ కుంభార్ దర్శకత్వం వహించిన ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ నటులు పుల్కిత్ సామ్రాట్, లోపాముద్ర రౌత్, వర్తికా సింగ్, అడ్లైన్ కాస్టెలినోల ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ సైతం కనిపించింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Miss Diva (@missdivaorg)