మూడేళ్ల కనిష్టానికి.. హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మూడేళ్ల కనిష్టానికి.. హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ మే నెలలో మైనస్ 3.48 శాతంగా రికార్డయ్యింది.  ఈ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్  వరుసగా రెండో నెలలో కూడా నెగెటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొలిచే డబ్ల్యూపీఐ 0.92 శాతంగా ఉంది. 

 ఫుడ్, ఫ్యూయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాన్యుఫాక్చరింగ్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ధరలు తగ్గడంతో డబ్ల్యూపీఐ కిందటి నెలలో మూడేళ్ల దిగువకు పడింది. కిందటేడాది మే నెలలో డబ్లూపీఐ 16.63 శాతంగా రికార్డయ్యింది. ఆహార పదార్ధాల ధరలను కొలిచే ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేషన్ 1.51 శాతానికి తగ్గింది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ నెంబర్ 3.54 శాతంగా  రికార్డయ్యింది.