ఉచితంగా ల్యాండ్​ తీసుకున్న హాస్పిటల్స్… కరోనాకు ఫ్రీ ట్రీట్ మెంట్ చేయవా?

ఉచితంగా ల్యాండ్​ తీసుకున్న హాస్పిటల్స్… కరోనాకు ఫ్రీ ట్రీట్ మెంట్ చేయవా?

కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : ప్రభుత్వం నుంచి ఫ్రీగా ల్యాండ్ పొందిన ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా పేషెంట్లకు ఎందుకు ఉచితంగా ట్రీట్ మెంట్ చేయటం లేదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ను కరోనా పేషెంట్స్ కు ఫ్రీ ట్రీట్ మెంట్ ఇచ్చేలా చేసేందుకు ఏమైనా అడ్డంకులున్నాయా చెప్పాలని కోరింది. కరోనా లాంటి మహమ్మారి నుంచి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ పైసలు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ సచిన్ జైన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ఈ సందర్భంగా కోర్టు సంచలన కామెంట్స్​ చేసింది. ప్రభుత్వం నుంచి ఫ్రీగా , లేదంటే నామినల్ ధరలకు భూములు పొందిన ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా పేషెంట్స్ కు ఎందుకు ఉచితంగా ట్రీట్ మెంట్ చేయవని చీఫ్ జస్టిస్ ఎస్.ఐ బొబ్డే ప్రశ్నించారు. “వారికి ఫ్రీగా లేదా నామినల్​డబ్బులు తీసుకుని భూమి ఇచ్చారు. ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా పేషెంట్లకు ఫ్రీగా ట్రీట్ మెంట్ చేయాలి కదా” అని చీఫ్​ జస్టిస్​ అన్నారు. ప్రభుత్వం అలా భూమి కేటాయించిన హాస్పిటల్స్ ను గుర్తించి వారి అభిప్రాయాలెంటో వారం రోజుల్లోగా చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ఆదేశించింది. కరోనా పేషెంట్ల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ రూ. 10 నుంచి 12 లక్షల వరకు వసూలు చేస్తున్నాయని, కనీసం ఒక సర్జరీ కూడా లేకుండా ఇంత మొత్తం ఎలా వసూలు చేస్తారని పిటిషనర్ ప్రస్తావించారు. దీనిపై కోర్ట్​ రియాక్ట్​ అవుతూ… కరోనా పేషెంట్ల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ వసూలు చేస్తున్న ఛార్జీల్లో కంట్రోల్​ ఉండాలని సూచించింది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫ్రీ ట్రీట్ మెంట్ ఉన్న అవకాశాలపై వారం రోజుల్లో వివరాలు ఇవ్వాలంటూ కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.

క్వారంటైన్ తప్పనిసరి చేయటంపై పిటిషన్

హెల్త్ వర్కర్స్ కు అందరికీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం 14 రోజుల పాటు క్వారంటైన్ తప్పని సరి చేయటంపై డాక్టర్లు సుప్రీంకోర్టులో కేసు వేశారు. కరోనా ట్రీట్ మెంట్ సర్వీసులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లాలనుకునే హెల్త్ వర్కర్స్ కు రెండు వారాల క్వారంటైన్ తప్పని సరి చేస్తూ ఈనెల 15 న కేంద్రం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఐతే కేసుల తీవ్రత ఎక్కువ ఉన్న చోట, లేదంటే కరోనా లక్షణాలు ఉన్న వారికి మాత్రమే క్వారంటైన్ ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పిస్తుందని, మిగతా హెల్త్ వర్కర్స్ కు మాత్రం క్వారంటైన్ ఫెసిలిటీ కల్పించమని తెలిపింది. దీనిపై పలువురు డాక్టర్లు సుప్రీంకోర్టుకు ఇది వరకే వెళ్లారు. ఈ పెండింగ్ పిటిషన్ పై డాక్టర్లు అఫిడవిట్ ను బుధవారం సమర్పించారు. దీనిపై సమాధానం వారం రోజుల్లో సమాధానం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ను కోర్టు ఆదేశించింది.

‘Why Can’t Private Hospitals Built on Free Land Give Free Treatment to COVID-19 Patients’, SC Asks Centre