
కరోనా వైరస్ సోకి ట్రీట్మెంట్ తీసుకుంటున్న భర్తకు మద్యం సరఫరా చేసి తన పతిభక్తిని చాటుకుంది మహా ఇల్లాలు.
తమిళనాడు కడలూరు జిల్లా కు చెందిన ముత్తుకుమారన్ (48) అతని భార్య ఎం. కలైమంగై భార్య భర్తలు.అయితే భర్త ముత్తుకుమారన్ కు కరోనా సోకడంతో ట్రీట్మెం నిమిత్తం రాజా ముత్తయ్య మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఎప్పటిలాగే ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న భర్త ముత్తుకుమారన్ కు భార్య కలైమంగై క్యారియర్ తెచ్చి ఇచ్చింది.
అన్నం తిన్న ముత్తుకుమారన్ ఆస్పత్రిలో వార్డ్ లో వీరంగం సృష్టించాడు. దీంతో భయాందోళనకు గురైన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది సమాచారంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భార్య కలైమంగై అన్నం తెచ్చిన బ్యాగ్ ను తెరిచి చూడగా అందులో మద్యం సీసాలు ఉన్నట్లు తేలింది. దీంతో అన్నామలై నగర్ పోలీసులు..నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు చేసి దర్యాప్తు ప్రారంభించారు.