వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ నుంచే పోటీ చేస్తా: బండి సంజయ్

వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ నుంచే పోటీ చేస్తా: బండి సంజయ్

కరీంనగర్: జమిలి ఎన్నికలు రాకపోతే వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ నుంచే పోటీ చేస్తానని బీజేపీ నేత బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ లో గెలిచేది బీజేపీనే.. బూత్ ల వారీగా పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు.  రాజకీయాలను కేసీఆర్ చిల్లరగా మార్చాడని ఆరోపించాడు. బీజేపీ అంటే కేసీఆర్ భయపడుతున్నాడని.. అందుకే కాంగ్రెస్ ను  లేపే ప్రయత్నం చేస్తున్నాడని బండి సంజయ్ అన్నారు.  

కరీంనగర్ లో స్వార్థ రాజకీయాలకోసం యువతను గంజాయికి బానిసలని చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. గంజాయిని పోలీసులు అడ్డుకోకుంటే బీజేపీ కార్యకర్తలే దాడులు చేసి ఆపుతారని హెచ్చరించారు. 

చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన బండి సంజయ్..  మాజీ సీఎంను ఇలా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. కక్ష్యపూరితంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని స్పష్టం గా కనిపిస్తోందన్నారు. అరెస్ట్ తో చంద్రబాబు ఇమేజ్ పెరిగిందని.. అరెస్ట్ తప్పని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారని అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చి తిరగబడే పరిస్థితి వచ్చిందన్నారు బండి సంజయ్. 

తెలంగాణలో 22 లక్షల మంది కౌలు రైతులున్నారని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి.. కౌలు రైతులకు నరేంద్ర మోడీ సబ్సిడీ తప్పా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం లేదని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని విమర్శించారు.