ఇట్ల స్కాములు చేస్తే పెట్టుబడులు వస్తయా?

ఇట్ల స్కాములు చేస్తే పెట్టుబడులు వస్తయా?

ఎన్​ఎస్​ఈ కేసులో సీబీఐపై కోర్టు ఫైర్​

న్యూఢిల్లీ: నేషనల్​ స్టాక్​ ఎక్సేంజ్​(ఎన్​ఎస్​ఈ) కోలొకేషన్​ కేసులో సీబీఐ దర్యాప్తుపై ఢిల్లీ కోర్టు మండిపడింది. ఇన్వెస్టిగేషన్​ నెమ్మదిగా నడుస్తున్నదంటూ ఆఫీసర్లను మందలించింది. ‘‘ రూ.వెయ్యి కోట్ల స్కామ్​ ఇది! ఇంతకంటే ఎక్కువ మొత్తం కూడా కావొచ్చు. మనదేశ ప్రతిష్ట ప్రమాదంలో ఉంది. ఎందరో విదేశీయులు ఇండియాలో ఇన్వెస్ట్​ చేస్తారు. ఎన్​ఎస్​ఈలో అంతా బాగానే ఉందని అనుకుంటారు. మోసాలు జరుగుతున్నాయని తెలిస్తే ఎవరు డబ్బు పెడతారు ? ఇన్వెస్టిగేషన్​ను మీరు తేలిగ్గా తీసుకుంటున్నారు”అని స్పెషల్​ జడ్జి సంజీవ్​ అగర్వాల్​విమర్శించారు. ఇంకెన్నాళ్లు ఇన్వెస్టిగేషన్​ చేస్తారని ప్రశ్నించారు. ఇండియా మీద నమ్మకం పోతుందని, ఇన్వెస్టర్లు చైనా వెళ్లిపోతారని అన్నారు. ఈ కేసులో అరెస్టయిన ఎన్ఎస్‌ఈ ఆఫీసర్​ను ఇన్వెస్టిగేషన్​సమయంలో ఎటైనా తీసుకెళ్లారా ? అని అడగ్గా ఎన్​ఎస్​ఈ మాజీ ఎండీ చిత్రతో కలసి ప్రశ్నించామని సీబీఐ తెలిపింది. అయినప్పటికీ పెద్దగా సమాచారం దొరకలేదని పేర్కొంది. ‘‘మరి అతణ్ని నేరం జరిగిన చోటుకు ఎందుకు తీసుకెళ్లలేదు ? మీరు సీబీఐ ఆఫీసులో కూర్చొని హాయిగా రిలాక్స్​ అవుతున్నారు. అసలు ఇందులో సెబీ పాత్ర ఏంటి ? క్యాపిటల్​ మార్కెట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవాలి. కేవలం అరవడమే కాదు కరవాలి”అని అన్నారు.  ఆనంద్​, చిత్రలను కలిపి ప్రశ్నించామన్న విషయాన్ని కూడా రాతపూర్వకంగా తెలియజేయలేదని అగర్వాల్​ మండిపడ్డారు.