ఓఎన్​జీసీ లాభం 30 శాతం డౌన్

ఓఎన్​జీసీ లాభం 30 శాతం డౌన్

న్యూఢిల్లీ: ఓఎన్​జీసీ క్యూ 2 నికర లాభం 30 శాతం తగ్గిపోయింది.  విండ్​ఫాల్​ ట్యాక్స్​ ఎఫెక్ట్​తోనే సెప్టెంబర్​ 2022 క్వార్టర్​ లాభం  రూ. 12,826 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది రెండో క్వార్టర్లో ఓఎన్​జీసీకి రూ. 18,348 కోట్ల నికర లాభం వచ్చింది. జూన్​ 2022 క్వార్టర్​తో పోల్చినా నికర లాభం 15.6 శాతం తగ్గినట్లు ఓఎన్​జీసీ తెలిపింది. ఉత్పత్తి చేసిన క్రూడాయిల్​ గ్రాస్​ బిల్లింగ్​ పెరిగినప్పటికీ ఓఎన్​జీసీకి లాభం తగ్గడం గమనించదగ్గ విషయం.

సెప్టెంబర్​ క్వార్టర్లో గ్రాస్​ బిల్లింగ్​ బ్యారెల్​కు  37.7 శాతం అధికమై 95.49 డాలర్లకు చేరింది. ఓఎన్​జీసీ తాను వెలికి తీసిన క్రూడాయిల్​ను ఇంటర్నేషనల్​ బెంచ్​ మార్కెట్​ రేట్లకు రిఫైనరీలకు అమ్ముతుంది. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్​ రేట్లు గ్లోబల్​గా పెరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 1 నుంచి ప్రభుత్వం కొత్తగా విండ్​ఫాల్​ ట్యాక్స్​ను అమలులోకి తెచ్చింది. దీనిని తెచ్చినప్పుడు బ్యారెల్​కు ఏకంగా 40 డాలర్లను చెల్లించాల్సి వచ్చింది.

ప్రతీ 15 రోజులకోసారి గ్లోబల్​ ఆయిల్​ రేట్లను బట్టి విండ్​ఫాల్​ ట్యాక్స్​ను అడ్జస్ట్​ చేస్తున్నారు. దీంతో బ్యారెల్​కు 75–76 డాలర్లు మాత్రమే ఓఎన్​జీసీకి రియలైజేషన్​గా లభిస్తోంది.