
- మహబూబ్‌నగర్‌లో దారుణం
పాలమూరు, వెలుగు : ఓ మహిళ తన కూతుర్ని చంపి తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. టూ టౌన్ ఎస్సై విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో నివాసం ఉండే యశోద (36) సోమవారం(ఆగస్టు25) ఉదయం ఇంట్లో ఎవరూ లేని టైంలో తన కూతురు అక్షర(3)ను ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం ఆమె కూడా ఉరి వేసుకుంది.
కొద్దిసేపటి తర్వాత గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా, యశోదకు మతిస్థిమితం సరిగా లేదని.. ఈ కారణం వల్లే కూతురిని చంపి తాను ఆత్మహత్య చేసుకుందని ఎస్సై తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.