చనిపోయి.. అరగంటకు బతికింది

చనిపోయి.. అరగంటకు బతికింది

గతేడాది ఫిబ్రవరిలో ఓ మహిళకు గుండెపోటు వచ్చింది. వెంటనే హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. అప్పటికే తను చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. కానీ 27 నిమిషాలకు తను మళ్లీ లేచింది. లేస్తూనే ‘పెన్ను.. పెన్ను’ అని అడిగింది. పేపర్‌‌పై ‘ఇట్స్‌‌ రియల్‌‌ (ఇది నిజం)’ అని రాసింది. అక్కడున్న వాళ్లకు ఏం అర్థం కాలేదు. అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. చుట్టాల్లో ఒకరు ‘వాట్స్‌‌ రియల్‌‌?’ అని అడిగారు. అప్పుడామె ‘నేను స్వర్గాన్ని చూశా. జీసెస్‌‌ కనిపించాడు’ అంటూ ఏడ్చేసింది. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. గుండెపోటు వచ్చిన మహిళ పేరు టీనా హైన్స్‌‌. తనది అరిజోనా రాష్ట్రం. తన ఆంటీకి జరిగిన ఈ అద్భుతాన్ని మ్యాడీ జాన్సన్‌‌ ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఈ మధ్యే పోస్టు చేశారు. ‘ఇట్స్‌‌ రియల్‌‌’ అని టాటూ ఉన్న చేతి ఫొటోనూ పోస్టు చేశారు.