
ప్రేమ విఫలం కావడంతో ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకోని ఆత్మహత్య కు పాల్పడింది ఒక యువతి. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో జరిగింది. యువతి బెడ్ రూంలో సుసైడ్ నోట్ ను గుర్తించారు పోలీసులు. తన చావుకు ప్రేమ విఫలమే కారణమని సుసైడ్ నోట్ లో రాసింది యువతి. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమికుల దినోత్సవం రోజు ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మెలిసి తిరిగిందని ఆమె స్నేహితులు చెప్పారు. మరి వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదని తెలిపారు.
అమ్మాయి తన సూసైడ్ నోట్లో అబ్బాయి గురించి రాసి చనిపోయినట్లుగా తల్లిదండ్రులకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని రాజేంద్రనగర్ పోలీసులు ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు