మ్యూచువల్ ఫండ్స్​లో మహిళల ఇన్వెస్ట్​మెంట్స్

మ్యూచువల్ ఫండ్స్​లో మహిళల  ఇన్వెస్ట్​మెంట్స్

న్యూఢిల్లీ:మ్యూచువల్ ఫండ్స్​లో మహిళల ఇన్వెస్ట్​మెంట్స్​ పెరుగుతూనే ఉన్నాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) అందించిన డేటా ప్రకారం, మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పరిశ్రమలో మహిళా పెట్టుబడిదారుల సంఖ్య డిసెంబర్ 2019లో 46.99 లక్షల నుంచి డిసెంబర్ 2022 చివరి నాటికి 74.49 లక్షలకు పెరిగింది.  కరోనా తర్వాత  మహిళా ఇన్వెస్టర్ల సంఖ్యలో  భారీ పెరుగుదల కనిపించింది .- ఈ విషయమై ఏఎంఎఫ్ఐ  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  వెంకటేష్ మాట్లాడుతూ, గత సంవత్సరం ఎంఎఫ్ ఇండస్ట్రీలోకి దాదాపు 40 లక్షల మంది కొత్త పెట్టుబడిదారులు వచ్చారని అన్నారు. అన్ని వయసుల మహిళలూ ఎంఎఫ్​లలో ఇన్వెస్ట్​ చేస్తున్నారని వివరించారు. మొత్తం ఇన్వెస్టర్లలో 28.45 లక్షల మంది మహిళా పెట్టుబడిదారులు 45 ఏళ్లు  అంతకంటే ఎక్కువ వయస్సు గల వాళ్లు కాగా, 2.82 లక్షల మంది మహిళా ఇన్వెస్టర్లు 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు గలవారు. అయితే18–-24 ఏళ్ల మధ్య ఉన్న మహిళా పెట్టుబడిదారులు డిసెంబర్ 2019 నుంచి నాలుగు రెట్లు పెరిగారు.  45 ఏళ్లపైబడిన మహిళా పెట్టుబడిదారుల సంఖ్య డిసెంబర్ 2019లో 22.13 లక్షల నుంచి 2022 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 28.46 లక్షలకు పెరిగింది.  మహిళా పెట్టుబడిదారులు ఎంఎఫ్​ రెగ్యులర్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కింద రూ. 6.13 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టగా, రూ. 1.42 లక్షల కోట్లు డైరెక్ట్ ప్లాన్ల కింద ఉన్నాయి. ఏఎంఎఫ్ఐ లెక్కల ప్రకారం, కరోనా సంవత్సరాలలో టాప్​–30 లొకేషన్స్​(టీ30),  లొకేషన్స్‌  బియాండ్​ టాప్​ 30 ( బీ30) నగరాల్లో మహిళా పెట్టుబడిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది.  టీ–30 నగరాల్లో మహిళా పెట్టుబడిదారుల సంఖ్య డిసెంబర్ 2019లో 27.95 లక్షల మంది నుంచి డిసెంబర్ 2022 నాటికి 41.67 లక్షలకు పెరిగింది. 

సిప్​ లెక్కలు ఇలా..

2023 మార్చి చివరి నాటికి ఎంఎఫ్ పరిశ్రమలో 6.36 కోట్ల సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ప్లాన్ (సిప్​) ఖాతాలు యాక్టివ్​గా ఉన్నాయి. వీటిలో 2.39 కోట్లు లేదా 38 శాతం ఖాతాలను ఒక సంవత్సరంలోపు తెరిచారు.  1.53 కోట్ల ఖాతాలు ఒకటి రెండు సంవత్సరాల నుంచి యాక్టివ్​గా ఉన్నాయి. ముఖ్యంగా, 73.13 లక్షల ఖాతాలు ఐదేళ్లకు పైగా యాక్టివ్‌‌‌‌గా ఉన్నాయి.   మార్చి 2023 చివరి నాటికి సిప్​ ఖాతాల కింద మొత్తం ఏయూఎం రూ. 6.83 లక్షల కోట్లకు చేరింది. 2.05 కోట్ల సిప్​ ఖాతాలు డైరెక్ట్ ప్లాన్‌‌‌‌ల కింద ఉండగా, 4.31 కోట్ల ఖాతాల సాధారణ ప్లాన్‌‌‌‌ల కింద ఉన్నాయి.