
చేతినిండా గాజులేసుకోమంటే ఓల్డ్ ఫ్యాషన్ అనే వాళ్లు అమ్మాయిలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆ ఓల్డ్ ఫ్యాషన్‌నే ట్రెండీగా ఫాలో అవుతున్నారు. సందర్భం ఏదైనా గాజులతోసందడి చేస్తున్నారు. జీన్స్ మీదకు గాజులను అందంగా మ్యాచ్ చేస్తున్నారు. ఇక మట్టి గాజుల సవ్వడి లేనిదే ఏ వేడుకకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వం అంటున్నారు. వీళ్ల అభిరుచికి తగ్గట్టుగానే మార్కెట్లో రంగురంగుల్లో డిఫరెంట్ డిజైన్స్‌లో గాజులు లభిస్తున్నాయి. ఆ ట్రెండీ గాజుల మధ్యలోఎవర్గ్రీన్ మట్టి గాజుల్ని అందంగా అమర్చి మోడ్రన్ మహాలక్ష్ములం అంటున్నారు ఈతరం అమ్మాయిలు.