జీవనశైలిలో గాంధీ కన్నా స్ఫూర్తి ఇంకెవరు ?

జీవనశైలిలో గాంధీ కన్నా స్ఫూర్తి ఇంకెవరు ?

ఒకప్పుడు సైకిల్ అంటే సామాన్య మానవునికి అదే పెద్ద వాహనం. అప్పట్లో ఇంటికి ఒక్క సైకిల్ అయినా ఉండేదంటే అతిశయోక్తి కాదు. ఇది పర్యావరణానికి కూడా ఎలాంటి హానీ చేయదు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. వేషధారణ, ఆహారపు అలవాట్లతో పాటు జీవనశైలిలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజుల్లో చాలా ప్రాంతాల్లో దాని రూపే కనిపించడం లేదు. కానీ కొంత మంది మాత్రం రోజూ వారి ఆరోగ్య నియమాలలో భాగంగా కాసేపైనా సైకిల్ తొక్కుతూ ముందు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ లైఫ్ స్టైల్ ఆఫ్ ఎన్విరాన్ మెంట్ అనే ట్యాగ్ తో ఈ రోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం. స్థిరమైన, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించే విషయంలో మహాత్మా గాంధీ కంటే స్ఫూర్తిగా నిలిచేవారు ఇంకెవరుంటారు అని ట్వీట్ చేశారు. 

 

 

ఈ క్రమంలోనే ప్రపంచ సైకిల్ దినోత్సవం పురస్కరించుకొని క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫిట్ ఇండియా ఫ్రీడం రైడర్ సైకిల్ ర్యాలీ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మరో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొన్నారు. అంతే కాకుండా సైకిల్ తొక్కడం అనేది పర్యావరణానికి, మనకూ మంచిదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా వయనాడ్ లోని అద్భుతమైన ప్రాంతాల్లో కొందరు సైకిల్ రైడింగ్ చేసే వీడియోను షేర్ చేశారు.

 

 

 

ఇక సైకిల్ దినోత్సవంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం స్పందించారు. ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కాలన్నాన్న మంత్రి... సైకిళ్ల వాడకం పెరిగితే కాలుష్యం తగ్గుతుందన్నారు. వరల్డ్ సైకిల్ డే సందర్భంగా నిర్మల్ జిల్లాలో జరిగిన సైకిల్ ర్యాలీలో ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. మొత్తం 15కిలోమీటర్లకు పైగా సాగిన ఈ ర్యాలీలో మంత్రి సైకిల్ తొక్కడం అందర్నీ ఆకర్శించింది. 

మరిన్ని వార్తల కోసం...

జాన్వీకపూర్ అదిరిపోయే డాన్స్ వీడియో వైరల్..

కోల్కత్తాలో 10 నిమిషాల్లో లిక్కర్ డెలివరీ